Karthika Deepam Serial Today August 2nd Episode: బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం 2’ సీరియల్ ఈ వారం పలు ఊహించని ట్విస్టులతో ఆసక్తికరంగా సాగింది. జూలై 27 నుండి ఆగస్టు 1 వరకు ప్రసారమైన ఎపిసోడ్లలో—జ్యోత్స్నకు పెళ్లి సంబంధాలు చూడటం, మాలిని ఎంట్రీతో ఇంట్లో మొదలైన తీవ్ర రచ్చ, శివన్నారాయణ కుటుంబంపై నిందలు వేయడం ప్రధానాంశాలుగా నిలిచాయి. మరోవైపు సూరజ్ ప్రవర్తనతో పారిజాతం-జ్యోత్స్నలు బురిడీ కొట్టించాలనుకున్నా, అతడు ప్లే చేసిన ‘రివర్స్ డ్రామా’తో అంతా తిరిగి వాళ్లకే చుట్టుకుంది. చివరికి సూరజే జ్యోత్స్నకు సరైన జోడీ అని శివన్నారాయణ కుటుంబం భావించడం, అతని వివరాలు సేకరించే బాధ్యతను కార్తీక్‌కు అప్పగించడంతో ఈ వారం కథనం అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగింది!














