టాలీవుడ్‌లో కౌశిక్ మేకల హవా.. వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతోన్న యంగ్ హీరో | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

యంగ్ టాలెంటెడ్ ఆర్టిస్టులు ప్రస్తుతం కొత్త కొత్త ప్రాజెక్టులు, డిఫరెంట్ కంటెంట్‌తో ఆడియెన్స్‌ని అలరిస్తున్నాడు. ఈ క్రమంలో యంగ్ హీరో కౌశిక్ ఇప్పటికే పలు ప్రాజెక్ట్‌లతో తన ముద్ర వేశాడు.

News18
News18

‘ప్రియురాలు’, ‘సిట్(ZEE5)’ వంటి ప్రాజెక్ట్‌లతో అందరినీ ఆకట్టుకున్న యువ నటుడు కౌశిక్ మేకల. యంగ్ టాలెంటెడ్ ఆర్టిస్టులు ప్రస్తుతం కొత్త కొత్త ప్రాజెక్టులు, డిఫరెంట్ కంటెంట్‌తో ఆడియెన్స్‌ని అలరిస్తున్నాడు. ఈ క్రమంలో యంగ్ హీరో కౌశిక్ ఇప్పటికే పలు ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులపై ముద్ర వేశాడు. ప్రస్తుతం ‘పార్ట్ టైమర్స్’ అనే వెబ్ సిరీస్‌లో హీరోగా పోషించి అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ సిరీస్ సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది.

నాగార్జున, ఎన్టీఆర్‌లు చేసిన యాడ్స్‌లోనూ కౌశిక్ మెరిశాడు. సిరీస్‌లు, సినిమాలు, ప్రకటనలు అంటూ కౌశిక్ ఫుల్ బిజీగా ఉన్నారు. అలాంటి కౌశిక్ వరుసగా సినిమాల్ని లైన్లో పెట్టారు. కౌశిక్ కీలక పాత్రలో నటించిన “వైరల్ వీడియో” అనే చిత్రం రిలీజ్ కి రెడీగా ఉంది. ప్రస్తుతం ఓ మూడు చిత్రాలు సెట్స్ మీదున్నాయి. మరి కొన్ని చిత్రాలు చర్చల దశల్లో ఉన్నాయి. క్రేజీ డైరెక్టర్‌లు, డిఫరెంట్ ప్రాజెక్ట్‌లతో కౌశిక్ మున్ముందు ప్రేక్షకుల్లో మరింత గొప్ప స్థానాన్ని సంపాదించుకోనున్నారు.

ఈ యంగ్ హీరో ప్రస్తుతం సైక్ సిద్దార్థ్ డైరెక్టర్ వరుణ్ రెడ్డితో ఓ సినిమాని చేయనున్నారు. జీవీ రామరాజు దర్శకత్వంలో హీరోగా చేసిన మరో చిత్రం కూడా విడుదలకు సిద్దంగా ఉంది. ఫైన్ ఫ్రేమ్ ఫిల్మ్స్ బ్యానర్ లో చేసిన సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇవి కాకుండా మరి కొన్ని చర్చల దశల్లో ఉన్నాయి. వాటికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడనున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports