Kavitha Demands : పవన్ కళ్యాణ్పై నిప్పులు చెరిగిన కవిత! | ACTPnews

Kavitha Demands : పవన్ కళ్యాణ్పై నిప్పులు చెరిగిన కవిత!



తెలంగాణ అవతరణ దినోత్సవం వేళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారులను ఉగ్రవాదులతో పోల్చడం, ఢిల్లీ వేదికగా మన స్వరాష్ట్ర ఉద్యమాన్ని విచ్ఛిన్నకర శక్తులతో (సెపరేటిజం) సమానంగా మాట్లాడటంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత యూనియన్లో భాగంగానే మేము ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాము తప్ప, దేశం నుండి విడిపోవాలని ఎప్పుడూ అనలేదని గుర్తుచేశారు. ఇంతటి వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలని, పవన్ కళ్యాణ్ పై వెంటనే దేశద్రోహం కేసు నమోదు చేయాలని కవిత డిమాండ్ చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *