Kavitha Warns Center | మహిళా రిజర్వేషన్లపై ‘డిలిమిటేషన్’ కుట్ర.. దక్షిణాది గొంతు నొక్కితే ఊరుకోం | ACTPnews

Kavitha Warns Center | మహిళా రిజర్వేషన్లపై ‘డిలిమిటేషన్’ కుట్ర.. దక్షిణాది గొంతు నొక్కితే ఊరుకోం



మహిళా రిజర్వేషన్ బిల్లు అమలును నియోజకవర్గాల పునర్విభజన (Delimitation)తో ముడిపెట్టడం కేంద్రం పన్నుతున్న అతిపెద్ద కుట్ర అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. గురువారం హైదరాబాద్లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. “మహిళల భుజాలపై తుపాకీ పెట్టి ఈ బిల్లును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు” అని ధ్వజమెత్తారు. జనాభా నియంత్రణ పాటించినందుకు తెలంగాణ వంటి రాష్ట్రాలకు రాజకీయ ప్రాధాన్యం తగ్గిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అలాగే, మహిళా రిజర్వేషన్లలో బీసీ సబ్ కోటా కచ్చితంగా ఉండాలని ఆమె డిమాండ్ చేశారు. పునర్విభజన సాకుతో దక్షిణాది రాష్ట్రాల సీట్లను తగ్గించి, ఉత్తరాది ప్రాబల్యాన్ని పెంచే ప్రయత్నాలను అడ్డుకుంటామని కవిత స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports