Last Updated:
KCR Farmhouse Protest: అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండగానే కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఎర్రవల్లి వెళ్లేందుకు ప్రయత్నించడంతో కేసీఆర్ కి మద్దతుగా, రక్షణగా వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలను బొల్లారం దగ్గర భారీగా మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు.
BRS vs CONGRESS: తెలంగాణ కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ నేతల మధ్య పొలిటికల్ వార్ హైదరాబాద్ అసెంబ్లీ నుంచి ఇప్పుడు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కి షిప్ట్ అయింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నిన్న ఈరోజు జరిగిన పరిణామాలపై భవిష్యత్ కార్యాచరణ, సలహాల కోసం బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్‌తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లిలోని కేసీఆర్‌ని కలవడానికి బయల్దేరిన సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్లాన్ పసిగట్టిన కాంగ్రెస్ నేతలు, పార్టీ కార్యకర్తలు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడికి ప్రయత్నించారు. ఈక్రమంలో బీఆర్ఎస్ నేతలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మధ్య ఘర్షణ జరిగింది. వెంకటాపూర్, చింతకమడక గ్రామాల్లో బీఆర్ఎస్ నేతల్ని అడ్డుకుంటున్నారు పోలీసులు.














