Kurasala Kannababu | చంద్రబాబుకు కన్నబాబు సీరియస్ వార్నింగ్! | ACTPnews

Kurasala Kannababu | చంద్రబాబుకు కన్నబాబు సీరియస్ వార్నింగ్!



మాజీ మంత్రి కురసాల కన్నబాబు సోమవారం (ఏప్రిల్ 6, 2026) విశాఖపట్నంలో మీడియా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) కారిడార్ చూసి చంద్రబాబుకు వెన్నులో వణుకు పుడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. “అమరావతి అవినీతిపై ఎక్కుపెట్టిన గన్ లాగా కూటమి నేతలకు మావిగన్ కనిపిస్తోంది” అని వ్యాఖ్యానించారు. ఒక పక్క రాష్ట్రంలో జీతాలకే డబ్బుల్లేవు అని చెబుతూనే, మరోపక్క రూ. 2 లక్షల కోట్లతో అమరావతిని ఎలా నిర్మిస్తారని ఆయన ప్రశ్నించారు. మావిగన్ లాంటి ఆచరణాత్మక ప్రతిపాదనలు చూసి తట్టుకోలేకే ప్రభుత్వం వెకిలి చేష్టలకు, వ్యక్తిగత విమర్శలకు దిగుతోందని కన్నబాబు మండిపడ్డారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports