Lakshmi Parvathi | నా దేవుడు ఎన్టీఆర్..ఎన్టీఆర్ ఆశయాలను ధ్వంసం చేసారు | ACTPnews

Lakshmi Parvathi  | నా దేవుడు ఎన్టీఆర్..ఎన్టీఆర్ ఆశయాలను ధ్వంసం చేసారు



తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, స్వర్గీయ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన సతీమణి, వైసీపీ నేత నందమూరి లక్ష్మీపార్వతి ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. “ఎన్టీఆర్ నా దేవుడు.. ఆయన భార్యను కావడానికి ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నానో” అంటూ కొనియాడారు. తెలుగు నేల, తెలుగు ఆత్మగౌరవం అనగానే గుర్తొచ్చే మొదటి పేరు ఎన్టీఆర్ అని.. ఘాట్ వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *