Last Updated:
LIC Golden Jubilee Scholarship: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత చదువులకు దూరమవుతున్న పేద విద్యార్థులకు ఎల్ఐసీ గుడ్న్యూస్ చెప్పింది. LIC గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ పథకం ద్వారా అర్హులైన విద్యార్థులకు ఏటా రూ.20,000 వరకు ఆర్థిక సాయం అందించనుంది. ఈ స్కాలర్షిప్కు ఎవరు అర్హులు, ఎలాంటి కోర్సులకు వర్తిస్తుంది, ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం.
ప్రతిభ ఉండి కూడా కేవలం ఆర్థిక స్థోమత లేదన్న ఒకే ఒక్క కారణంతో ఉన్నత చదువులకు దూరమవుతున్న పేద విద్యార్థులకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఒక గొప్ప శుభవార్త అందించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు తమ విద్యా కలలను సాకారం చేసుకునేందుకు ‘ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ (స్వర్ణోత్సవ) స్కాలర్షిప్ పథకం’ ద్వారా అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. పేద విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించడంతో పాటు, భవిష్యత్తులో వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ ప్రతిష్టాత్మక పథకం ముఖ్య ఉద్దేశం.














