Last Updated:
Lion Attack: అమ్రేలి జిల్లాలోని లిలియా ప్రాంతానికి చెందిన అంతాలియాలో రెవెన్యూ భూమి, రిజర్వ్ ఫారెస్ట్ సరిహద్దు ప్రాంతంలో ఓ సింహం 21 సంత్సరాల సోహిల్ మెమోన్ అనే యువకుడిపై దాడి చేసింది. ఎంతలా అంటే సింహానికి చిక్కిన సోహిల్ ప్రాణాలతో బయటపడలేనంతగా దాడి చేయడంతో అక్కడిక్కడే మరణించాడు.
Shocking News: భూమి మీద నివసించే ప్రతీ జీవి అది జీవించడానికి ఆహారం దొరికే ప్రాంతాల్లో ఆవాసం చేసుకొని బ్రతికేస్తూ ఉంటాయి. ఇది సృష్టి సహజ లక్షణం. అయితే అందుకే మనుషులు పట్టణాలు, నగరాలు, గ్రామాల్లో విలాసవంతమైన భవనాలు కట్టుకొని నివసిస్తే..వన్యప్రాణులు, క్రూరమృగాలు అడవిని ఆవాసంగా మార్చుకొని అక్కడే తలదాచుకుంటాయి. తమ కంటే చిన్న జీవులను వేటాడుతూ క్రూరమృగాలు బ్రతికేస్తుంటాయి. అయితే మనిషి ఉండే ప్రాంతాల్లోకి సహజంగా క్రూరమృగాలు రావు. అదే విధంగా మనుషులు కూడా అవి ఉండే అడవుల్లోకి వెళ్లడం జరగదు. ఎప్పుడైనా పొరపాటున వెళితే ఏం జరుగుతుందో గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో జరిగిన ఈఘటన ప్రజల్ని తీవ్రంగా భయపెడుతోంది. సింహాలు సంభోగం చేసుకునే సమయంలో ఓ యువకుడు కొందరు స్నేహితులతో కలిసి వెళ్తే ఏం చేస్తుంది చెప్పండి.. మంచి ఆకలితో ఉన్న సింహం ఆ యువకుడిపై దాడి చేసి అతడి రక్తం తాగి ప్రాణాలు తీసింది.
అమ్రేలి జిల్లాలోని లిలియా ప్రాంతానికి చెందిన అంతాలియాలో రెవెన్యూ భూమి, రిజర్వ్ ఫారెస్ట్ సరిహద్దు ప్రాంతంలో ఓ సింహం 21 సంత్సరాల సోహిల్ మెమోన్ అనే యువకుడిపై దాడి చేసింది. ఎంతలా అంటే సింహానికి చిక్కిన సోహిల్ ప్రాణాలతో బయటపడలేనంతగా దాడి చేయడంతో అక్కడిక్కడే మరణించాడు. స్థానికులు, ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం సంభోగం(ఆడ, మగ సింహాలు శృంగారం) చేసుకుంటున్న సమయంలో ఆ ప్రక్రియను దగ్గరగా చూడాలని కొందరు యువకులు బృందంగా కలిసి వెళ్లారు.
సహజంగా సింహాలు మనుషులపై దాడి చేసి చంపే అంత క్రూరంగా ప్రవర్తించవు. కాని వాటి రాసలీల సమయంలో ఎవరైనా డిస్టర్బ్ చేస్తే అస్సలు సహించవని ప్రతిదాడిగా వారి ప్రాణాలు తీస్తాయని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఈక్రమంలోనే రెండు సింహాలు సంభోగం చేసుకుంటున్న సమయంలో ఒక సింహం స్నేహితులతో ఉన్న సోహిల్‌ను చూసి ఈడ్చుకెళ్లి చంపేసింది. ఈ ఘటన గురించి సమాచారం అందగానే అటవీ శాఖ , పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మరణించిన వ్యక్తి మృతదేహం వద్ద సింహాలు ఆందోళనకరమైన స్థితిలో ఉండటంతో సహాయక చర్యలు చేపట్టడం చాలా సవాలుగా మారింది.
అయితే సోహిల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు అక్కడి నుండి సింహాలను తరిమేందుకు అటవీ శాఖ బృందం అధికారిక వాహనాల కాన్వాయ్‌తో ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. సింహాలను బంధించడానికి బోను, మత్తు ఇంజక్షన్లను సైతం సిద్దం చేసుకున్నారు. అయితే ఫారెస్ట్ అధికారులు సింహాలను అక్కడి నుంచి పారిపోయే విధంగా చర్యలు చేపట్టి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ఘటన తర్వాత సింహాన్ని చూసేందుకు అక్కడికి వచ్చిన కొందరు స్థానిక యువకులను విచారిస్తున్నారు. అమ్రేలి జిల్లాలో వన్యప్రాణుల దాడుల వల్ల మరణించే వారి సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన పెరిగింది. సాధారణంగా ప్రస్తుత కాలంలో ప్రజలకు ఇళ్లలో కంటే ఫామ్ హౌస్, అర్బన్ ఫారెస్టుల్లోకి తిరగాలనే కోరిక పెరిగిపోతోంది. అలాంటి విచిత్రమైన ఆలోచనల కారణంగానే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఫారెస్ట్ అధికారులు హెచ్చరిస్తున్నారు.
Hyderabad,Telangana
Jul 09, 2026 11:04 AM IST













