LSG vs PBKS: దుమ్మురేపిన శ్రేయస్ అయ్యార్.. లక్నోపై పంజాబ్ అద్భుత విక్టరీ.. ప్లేఆఫ్స్ ఆశలు సజీవం | క్రీడా వార్తలు | ACTPnews

credit:x


Last Updated:

పంజాబ్ కింగ్స్ 197 లక్ష్యాన్ని 18 ఓవర్లలో చేజ్ చేసి లక్నోపై గెలుపు, శ్రేయస్ అయ్యార్ సెంచరీ, ప్రభుసిమ్రన్ సింగ్ 69, జోష్ ఇంగ్లిస్ 72 వృథా

credit:x
credit:x

లక్నో సూపర్ జయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలో ఈజీగా ఛేజించేసింది. శ్రేయస్ అయ్యార్ బౌండరీల మోత మోగించాడు. కేవలం 51 బంతుల్లో 101 (11 ఫోర్లు, 5 సిక్సులు) పరుగులు సాధించి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య డక్కౌట్ అయినా.. మరో ఓపెనర్ ప్రభుసిమ్రన్ సింగ్ 69 (7 ఫోర్లు, 2 సిక్సులు) వేగంగా పరుగులు సాధించి శ్రేయస్ అయ్యార్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టాంచాడు. దీంతో టార్గెట్ మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే ముగించేశారు. ఇక లక్నో బౌలర్లలో షమీ 2, అర్జున్ టెండూల్కర్ ఒక వికెట్ తీసుకున్నాడు.

లక్నో బ్యాటింగ్ ఇలా..!

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 196 పరుగులు సాధించింది. జోష్ ఇంగ్లిస్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. కేవలం 44 బంతుల్లో 72 (9 ఫోర్లు, 2 సిక్సులు) పరుగులు సాధించి మంచి ఆరంభాన్ని అందించారు. ఇంగ్లిస్‌కి తోడు ఆయూష్ బదోని 43 (5 ఫోర్లు, 3 సిక్సులు) సైతం వేగంగా పరుగులు చేశాడు. వీరిద్దరు కలిసి పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. అనంతరం క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ (26), ముకుల్ ఛౌదరి (1) పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. చివర్లో వచ్చిన అబ్దుల్ సమద్ 37 (3 ఫోర్లు, 3 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో లక్నో 196 పరుగులు సాధించగలిగింది. ఇక పంజాబ్ బౌలర్లలో చాహల్, మార్కో జాన్‌సెన్ చోరో 2 వికెట్లు పడగొట్టగా.. శశాంక్ సింగ్, ఒమర్‌జై ఒక వికెట్ తీసుకున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *