Lt Gen Dhiraj Seth: భారత నెక్ట్స్ ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్.. పాక్ ఉగ్రమూకలకు చుక్కలు చూపిస్తారా? | | ACTPnews

భారత నెక్ట్స్ ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ (Image: X/@SpokespersonMoD)


Last Updated:

Lt Gen Dhiraj Seth: జనరల్ ఉపేంద్ర ద్వివేది పదవీ విరమణ చేసిన తర్వాత, లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ జూన్ 30న బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మార్పు.. భారత్‌తోపాటూ.. చుట్టుపక్కల దేశాల్లోనూ హాట్ టాపిక్ అవుతోంది.

భారత నెక్ట్స్ ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ (Image: X/@SpokespersonMoD)
భారత నెక్ట్స్ ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ (Image: X/@SpokespersonMoD)

భారత నెక్ట్స్ సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్‌ను నియమిస్తున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. ప్రస్తుత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది పదవీ విరమణ తర్వాత, ఆయన జూన్ 30న బాధ్యతలు స్వీకరిస్తారు.

“జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో తర్వాతి సైన్యాధిపతిగా 30 జూన్, 2026 నుంటి బాధ్యతలు చేపడతారు. 31 ఆగస్టు, 2028 వరకు పదవిలో ఉంటాయి. ఈ నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు ఆదేశాలు అందాయి” అని రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ఒక లేఖలో తెలిపారని న్యూస్18 ఇంగ్లీష్ రిపోర్ట్ చేసింది.

1986లో ఆర్మర్డ్ కార్ప్స్ అధికారిగా నియమితులైన లెఫ్టినెంట్ జనరల్ సేథ్, ఖడక్‌వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి. ఆయన దాదాపు నాలుగు దశాబ్దాల సైనిక అనుభవాన్ని కలిగి.. ఈ ఉన్నత పదవికి వస్తున్నారు. తన కెరీర్‌లో, ఆయన భారత సైన్యంలో ఆపరేషనల్, కమాండ్, స్టాఫ్ వంటి అనేక రకాల పోస్టులను నిర్వహించారు.

ఆయన వృత్తిపరమైన సైనిక విద్యలో భాగంగా, పారిస్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ కమాండ్ అండ్ జనరల్ స్టాఫ్ కోర్సు, న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజ్‌ సహా భారతదేశం, ఫ్రాన్స్, అమెరికాలోని సంస్థలలో కోర్సులను అభ్యసించారు.

లెఫ్టినెంట్ జనరల్ సేథ్.. ఒక ఆర్మర్డ్ రెజిమెంట్, ఒక ఆర్మర్డ్ బ్రిగేడ్, జమ్మూకాశ్మీర్‌లోని కౌంటర్ ఇన్సర్జెన్సీ ఫోర్స్, సుదర్శన్ చక్ర కార్ప్స్‌ సహా చాలా స్థాయిలలో దళాలకు నాయకత్వం వహించారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్‌గా పనిచేస్తూ, అనేక ఉన్నత స్థాయి జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలను పర్యవేక్షించారు.

ఈ ఏడాది ఏప్రిల్ 1న ఆర్మీ వైస్ చీఫ్‌గా నియమితులు కాకముందు, ఆయన పుణే కేంద్రంగా పనిచేసే సదరన్ కమాండ్‌కు అధిపతిగా ఉన్నారు. అక్కడ తన పదవీకాలంలో, ఆయన ఆపరేషన్ సింధూర్ సమయంలో కమాండ్‌కు నాయకత్వం వహించడంతో పాటు, పశ్చిమ సరిహద్దు వెంట జరిగిన ప్రధాన త్రివిధ దళాల విన్యాసాల్ని పర్యవేక్షించారు.

ఇవి కూడా చదవండి: Delhi cm bungalow: అది దెయ్యాల బంగ్లానా? అశుభమా? ముగ్గురు సీఎంల పదవులు కోల్పోయేలా చేసిందా?

ఆయన అంగోలాలోని ఐక్యరాజ్యసమితి మిషన్, ఆర్మీ ప్రధాన కార్యాలయంలోని నియామకాలు సహా కీలకమైన స్టాఫ్ పదవులలో కూడా పనిచేశారు. కార్యాచరణ, వ్యూహాత్మక బాధ్యతలు రెండింటినీ ఆయన తన జీవితకాలంలో నిర్వహించారు. అందువల్ల చైనా, పాకిస్థాన్ లాంటి దేశాలు.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న తరుణంలో.. ధీరజ్ సేథ్ నియామకం.. ఇండియా రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చెయ్యగలదనే నమ్మకం ఆర్మీలో ఉంది. ఆయన అధ్వర్యంలో దూసుకెళ్లేందుకు ఆర్మీ సిద్ధంగా ఉంది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports