Wi-Fi Safety Tips: ఈ రోజుల్లో చాలా మంది వైఫై రౌటర్లను వాడుతున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి పనీ ఇంటర్నెట్‌పైనే ఆధారపడి ఉంది. చాలా మంది వైఫై వినియోగదారులు, వైఫై పాస్‌వర్డ్ పొడవుగా, బలంగా ఉంటే తమ నెట్‌వర్క్ పూర్తిగా సురక్షితంగా ఉంటుందని భావిస్తారు. కానీ సైబర్ సెక్యూరిటీ నిపుణుల ప్రకారం కేవలం పాస్‌వర్డ్ ఆధారంగా నెట్‌వర్క్‌ను సురక్షితంగా ఉంచలేరు. అసలైన భద్రత అనేది మొత్తం నెట్‌వర్క్‌ను పర్యవేక్షించి, నియంత్రించే మీ రౌటర్ సెట్టింగ్‌లపై ఆధారపడి ఉంటుంది. ఈ సెట్టింగ్‌లను సరిగ్గా నిర్వహించకపోతే, హ్యాకర్లు మీ నెట్‌వర్క్‌లోకి సులభంగా ప్రవేశించగలరు.













