Maa Inti Bangaram OTT Release: మా ఇంటి బంగారం ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

సమంత లేటెస్ట్ సినిమా మా ఇంటి బంగారం ప్రస్తుతం థియేటర్స్ లో సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై కీలక సమాచారం బయటకొచ్చింది.

News18
News18

దాదాపు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) వెండితెరపై సంచలనం సృష్టించింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram) బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది.నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సమంత కెరీర్‌లోనే ఓ పవర్ ఫుల్ కమ్‌బ్యాక్‌గా నిలిచింది. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది.

ఓ పక్క ఫ్యామిలీ ఎమోషన్స్, మరోపక్క అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ ఉండటంతో సినిమా ఫస్ట్ డే నుంచే భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. తొలి రోజే రూ. 13 కోట్లకు పైగా గ్రాస్ సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన పోటీ లేకపోవడం ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. చిత్ర బృందం అధికారికంగా ప్రకటించిన లెక్కల ప్రకారం, ఇప్పటివరకు ఈ సినిమా రూ. 73 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సత్తా చాటింది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ ఈ మూవీ అదరగొడుతోంది. అమెరికా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే 2 మిలియన్ డాలర్ల (2 Million Dollars) మార్క్‌ను క్రాస్ చేసింది. ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు కలిసి సుమారు రూ. 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ఇప్పుడు రూ. 100 కోట్ల క్లబ్ దిశగా పరుగులు పెడుతోంది.

ఇదిలా ఉంటే, థియేటర్లలో భారీ విజయం సాధించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ‘మా ఇంటి బంగారం’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జియో హాట్ స్టార్’ (Jio Hotstar) భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. థియేట్రికల్ రన్ ముగిసిన 4 నుంచి 6 వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా డీల్ కుదిరిందట. ఈ లెక్కన చూసుకుంటే, జులై చివరి వారంలో లేదా ఆగస్ట్ మొదటి వారంలో ఈ సినిమా జియో హాట్ స్టార్‌లో అందుబాటులోకి రానుందని చెప్పుకోవచ్చు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఏదేమైనా తన సొంత బ్యానర్‌పై వచ్చిన తొలి చిత్రంతోనే సమంత అటు ప్రొడ్యూసర్‌గా, ఇటు యాక్టర్‌గా డబుల్ బ్లాక్ బస్టర్ అందుకుని విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *