Last Updated:
Mahendragiri Varahi: సెప్టెంబర్ 11న థియేటర్లలోకి రాబోతున్న ‘మహేంద్రగిరి వారాహి’ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సుమంత్ నటించిన ఈ డివోషనల్ మిస్టిక్ థ్రిల్లర్లో అనూప్ రూబెన్స్ అందించిన పాటలు ఆకట్టుకుంటున్నాయి.
Mahendragiri Varahi: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫార్ములా మారిపోయింది. ఒకప్పుడు కథలు బాగుండి పెర్ఫెక్ట్ మేకింగ్ తో ఉన్న సినిమాలు మాత్రమే ఆడేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది చాలా సినిమాలు బ్యాగ్రౌండ్ స్కోర్ మీదనే డిపెండ్ అయి సక్సెస్ లను సాధిస్తున్నాయి… రజినీకాంత్ హీరోగా నెల్సన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘జైలర్’ మూవీ కేవలం బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుండటం వల్లే సక్సెస్ అయింది. ఇక ఆ తర్వాత చాలా సినిమాలు అలానే సక్సెస్ అయ్యాయి… యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల మూవీస్ వరకు కంటెంట్ ఎలా ఉన్నా సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుడిని ఎమోషనల్ గా కట్టిపడేస్తూ, ఎలివేషన్స్ ను పెర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసినపుడే అవి మంచి రిజల్ట్ ను ఇస్తున్నాయి…నిజానికి బ్యాక్రౌండ్ స్కోర్ ద్వారానే ఎమోషనల్ సీన్స్, ఎలివేషన్ సన్నివేశాలు 100% వర్కౌట్ అవుతున్నాయి… అంటే ఒక సినిమా విజయంలో మ్యూజిక్ డైరెక్టర్ పాత్ర చాలా కీలకంగా మారిపోయింది.అందులో భాగంగానే సుమంత్ హీరోగా చేసిన ‘మహేంద్రగిరి వారాహి’ మూవీ లో సైతం బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ మూవీకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటి వరకు అనూప్ అంటే ఇష్క్, మనం, టెంపర్ లాంటి మూవీస్ మాత్రమే గుర్తుకు వచ్చేవి.














