Mahesh Babu: వారణాసి బ్లడ్ బాత్ యాక్షన్ సీన్ విజువల్స్ లీక్.. బాబోయ్, ఈ రేంజ్‌లో షూట్ చేస్తున్నారా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న వారణాసి మూవీ షూటింగ్ లొకేషన్ నుంచి ఓ షాకింగ్ వీడియో లీక్ అయింది. క్షణాల్లోనే ఇది వైరల్ అయింది.

News18
News18

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ (SSMB29) పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ స్థాయి టేకింగ్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, అత్యంత రహస్యంగా సాగుతున్న ఈ సినిమా షూటింగ్ సెట్స్ నుంచి ఊహించని విధంగా కొన్ని యాక్షన్ క్లిప్స్ సోషల్ మీడియాలో లీక్ కావడం టాలీవుడ్‌లో సంచలనంగా మారింది.

ఇటీవల ‘వారణాసి’ మూవీ అవుట్‌డోర్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుండగా, సెట్స్ లోని కొందరు రహస్యంగా తీసిన షార్ట్ వీడియో క్లిప్స్ ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. ఈ వీడియోల్లో మహేష్ బాబును మునుపెన్నడూ చూడని ‘బ్లడ్ బాత్’ మాస్ అవతారంలో చూసిన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఒళ్లంతా నెత్తుటి మరకలతో ఉన్న మహేష్ బాబు, తీక్షణమైన చూపులతో నీళ్లలోకి దిగుతున్న యాక్షన్ సీన్స్ చూసి అభిమానులకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఈ విజువల్స్ నిమిషాల్లోనే ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్ లలో వైరల్ గా మారాయి.

లీక్స్‌పై మూవీ టీమ్ ఫైర్.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక:

ఈ లీక్డ్ వీడియోల వ్యవహారంపై రాజమౌళి మూవీ టీమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గ్లోబల్ స్థాయిలో కోట్లాది రూపాయల ఖర్చుతో తెరకెక్కుతున్న ఈ సినిమా విజువల్స్ ముందే బయటకు రావడం పట్ల నిర్మాతలు సీరియస్ అయ్యారు. ఎవరైనా ఈ లీక్డ్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తే, వారి అకౌంట్లను వెంటనే సస్పెండ్ చేయిస్తామని ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా, సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో పైరసీకి పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కానీ ఈ లీకుల పరంపర మాత్రం ఆగడం లేదు.

ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో మహేష్ బాబు తొలిసారిగా డ్యూయల్ రోల్‌ చేస్తున్నట్లు సమాచారం. గ్లోబల్ అప్పీల్ కోసం హాలీవుడ్ స్థాయి నటీనటులతో పాటు గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి అగ్ర తారలను కీలక పాత్రల కోసం ఎంపిక చేశారు. అడ్వెంచర్ తరహాలో సాగే ఈ కథ ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్ ను పంచనుంది.

2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల:

శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై డాక్టర్ కె.ఎల్. నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ విజువల్ వండర్‌ను నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా అత్యంత గ్రాండ్ గా విడుదల కానుంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports