Mahesh Babu 51st Birthday: 5000 మందికి పైగా చిన్నారులకు ఉచిత హార్ట్ ఆపరేషన్లు.. రియల్ హీరో మహేష్‌బాబు | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

రియల్ హీరో మహేష్‌బాబు (Image credit - https://www.maheshbabufoundation.org)


Last Updated:

Mahesh Babu 51st Birthday: ఒక ఫ్యామిలీలో ఒకరికి హార్ట్ ఆపరేషన్ అంటేనే చాలా కష్టం. ఆ కుటుంబం అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితి వచ్చేస్తుంది. అలాంటిది మహేష్ బాబు.. తన సంస్థ ఎంబీ ఫౌండేషన్ ద్వారా ఏకంగా 5వేల మందికి పైగా చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ చేయించడం మామూలు విషయం కాదుగా.

రియల్ హీరో మహేష్‌బాబు (Image credit - https://www.maheshbabufoundation.org)
రియల్ హీరో మహేష్‌బాబు (Image credit – https://www.maheshbabufoundation.org)

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ ‘రియల్ హీరో’ అని ఎన్నోసార్లు నిరూపించుకున్నారు. నేడు (ఆగస్టు 9) ఆయన తన 51వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన సినిమాల గురించి మాత్రమే కాకుండా, ఆయన నిశ్శబ్దంగా చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను అభిమానులు, ప్రజలు ఎంతో గర్వంగా గుర్తుచేసుకుంటున్నారు. తన సేవా కార్యక్రమాలను బయటకు చెప్పుకోవడానికి ఏమాత్రం ఇష్టపడని మహేష్ బాబు, ‘మహేష్ బాబు ఫౌండేషన్’ (ఎంబీ ఫౌండేషన్) ద్వారా వేలాది మంది చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయిస్తూ వారికి పునర్జన్మ ప్రసాదిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports