Last Updated:
Malika Handa: ప్రతిభను గుర్తించి, క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రాంతాలు అడ్డుకాదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరూపించారు. క్రీడాకారుల అవసరాలకు అనుగుణంగా వ్యక్తిగతంగా నాలుగేళ్ల క్రితమే ఆయన ప్రోత్సహించి నగదుతో సత్కరించిన మలికా హండా నేడు అంతర్జాతీయ స్థాయిలో పతకం సాధించింది. ఈసందర్భంగా మరోసారి ఆమె విజయాన్ని అభినందించారు కేటీఆర్.
Malika Handa: ప్రతిభావంతమైన చెస్ క్రీడాకారిణి మలికా హండాకు 2022లోనే వ్యక్తిగతంగా రూ.15 లక్షల ఆర్థిక సాయం అందించడంతో పాటు ల్యాప్‌టాప్ బహుమతిగా ఇచ్చి అండగా నిలిచారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నేడు ఆమె అంతర్జాతీయ స్థాయిలో పతకం సాధించడంతో అభినందనలు తెలిపారు. మలేషియాలోని పెనాంగ్‌లో జరిగిన ఆసియా పసిఫిక్ డెఫ్ మల్టీ స్పోర్ట్ ఛాంపియన్‌షిప్–2026లో మహిళల క్లాసికల్ ఇండివిడ్యువల్ చెస్ విభాగంలో మలికా హండా కాంస్య పతకం సాధించింది. ఈసందర్భంగా మరోసారి కేటీఆర్ నాలుగేళ్ల క్రితం తాను అభినందించి ప్రోత్సహించిన ఫోటోలను సోషల్ మీడియా హ్యాండిల్ ట్విట్టర్(ఎక్స్)ద్వారా షేర్ చేసుకొని మరోసారి కంగ్రాట్స్ తెలిపారు.
అంతర్జాతీయ చెస్ క్రీడాకారిణి మలికా హండా ఆసియా పసిఫిక్ డెఫ్ మల్టీ స్పోర్ట్ ఛాంపియన్‌షిప్–2026లో కాంస్య పతకం సాధించింది. 2022 జనవరిలోనే మలికా ప్రతిభను గుర్తించిన కేటీఆర్ ఆమెకు తన వ్యక్తిగత సామర్థ్యంలో సహాయం అందిస్తానని ప్రకటించారు. ఆ మాట ప్రకారం ఆమెను కలిసి రూ.15 లక్షల ఆర్థిక సాయం అందించడంతో పాటుగా భవిష్యత్తు ఛాంపియన్‌షిప్‌లకు సన్నద్ధమయ్యేందుకు ల్యాప్‌టాప్‌ను బహూకరించారు. అంతేకాకుండా మలికాకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని అప్పటి కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కోరారు.
Congratulations, @MalikaHanda Ji, on winning the Bronze Medal in the Classical Individual (Women) event at the Asia Pacific Deaf Multi-Sport Championship 2026 in Penang, Malaysia! 🇮🇳🏆
Your determination and achievement are truly inspiring. Proud to have supported your journey in a small way.Wishing you many more victories ahead! 👏
— KTR (@KTRBRS) October 12, 2026
తాజాగా మలికా సాధించిన పతకంపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆమెకు అభినందనలు తెలుపుతూ మలికా పట్టుదల, విజయం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆమె క్రీడా ప్రయాణంలో తాను కొంతమేర సహకరించగలిగినందుకు గర్వంగా ఉందని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈసందర్భంగా ప్రతిభ ఉండాలే కాని సొంత రాష్ట్రమే కాదు దేశంలో ఎక్కడి వారినైనా ప్రోత్సహించే కేటీఆర్ లాంటి నాయకుడి మంచి తనాన్ని ఈసందర్భంగా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కీర్తిస్తున్నారు. ఒక మూగ బాలికలోని పట్టుదలను పెంచి నేడు అంతర్జాతీయ స్థాయిలో ఆమెకు గుర్తింపు రావడానికి పరోక్షంగా దోహదపడిన వ్యక్తి కేటీఆర్ అంటూ కామెంట్స్ షేర్ చేస్తున్నారు.














