“ఈ సంవత్సరం మొదటి 6 నెలల్లో అనేక అభివృద్దులు జరిగాయి. దేశ భద్రత, ఆత్మనిర్భరత విషయంలో చాలా ముందు అడుగులు పడ్డాయి. ముఖ్యంగా భారత నౌకా దళంలోకి మూడు కీలక యుద్ధ నౌకలు చేరాయి. నౌకుల తయారీ, డిజైన్ అంతా దేశీయంగా జరిగింది. జూన్ నెలలో వైమానిక రంగంలో కూడా అభివృద్ధి జరిగింది. C-295 15 A అనే యుద్ధ విమానం.. ఇండియాలో తయారైంది. అది పూర్తి స్థాయిలో ఆకాశంలో ఎగిరింది. ఇప్పుడు అలాంటి 40 యుద్ధ విమానాల్ని ఇండియా తయారుచేస్తోంది. ఇలా ఏరో స్పేస్ సెక్టార్‌కి కలిసొస్తోంది” అని మోదీ తెలిపారు.
“DRDO కూడా లాంగ్ రేంజ్ లాండ్ ఎటాక్ క్రూయిజ్ మిస్సైల్‌ని విజయవంతంగా పరీక్షించింది. దీన్ని డీఆర్డీఓ ల్యాబరేటరీస్, ఇండియన్ ఇండస్ట్రీ పార్ట్నర్స్ కలిసి తయారుచేశారు. సముద్రం నుంచి ఆకాశం వరకూ.. మన భారత్ మరింత సురక్షితం అయ్యింది” అని మోదీ తెలిపారు.
యోగా దినోత్సవం:
“జూన్ 21న జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రపంచవ్యాప్తంగా 2,500 లొకేషన్లకు పైగా ప్రాంతాల్లో.. లక్షల మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో కోట్ల మంది యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అహ్మదాబాద్‌లో గుజరాత్ యోగాసనా స్పోర్ట్స్ జరగగా.. 114 మంది మెడల్స్ గెలుచుకున్నారు. వాటిలో 102 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. విజేతలకు శుభాకాంక్షలు చెబుతున్నాను” అని మోదీ తెలిపారు.
బంగారం కొనొద్దు:
“ఇరాన్ యుద్ధ సమయం నడుస్తోంది. అందువల్ల దేశ ప్రజలు బంగారం కొనవద్దు. అలాగే విదేశీ ప్రయాణాలు వీలైనంతవరకూ పెట్టుకోవద్దు. కార్ పూలింగ్ చెయ్యమన్నాను. వ్యవసాయంలో ఎరువుల వాడకం తగ్గించమన్నాను. సహజ ఎరువుల్ని వాడమన్నాను. నా సందేశాన్ని చాలా మంది పాజివిట్‌గా తీసుకున్నారు. ఈసారి చాలా మంది పెళ్లిళ్లలో బంగారం కొనడం మానేశారు. పాత బంగారాన్నే.. కొత్తగా మార్పించుకుంటున్నారు. సోషల్ మీడియాలో చాలా మంది.. విదేశీ ప్రయాణాలను రద్దు చేసుకున్నట్లు తెలిపారు. కార్ పూలింగ్ చేపట్టినట్లు తెలిపారు. మెట్రో, బస్సుల్లో ప్రయాణిస్తున్నట్లు చెప్పారు. రైతులు కూడా సహజ ఎరువుల వాడకం పెంచారు. ఇది నాకు ఆనందం కలిగిస్తోంది. ఇలాంటి సంఘటిత శక్తితో ముందుకు వెళ్లగలం” అని మోదీ అన్నారు.
బీమా కవరేజ్ :
మహారాష్ట్రలోని నాందేడ్ లోని బహదూర్ పురాలో ఓ కుటుంబం ఏం చేసిందంటే.. తమ ఇంట్లో పెళ్లి సందర్భంగా.. గ్రామంలోని దాదాపు 3.5 వేల మందికి ప్రమాద బీమా సౌకర్యాన్ని ఉచితంగా కల్పించింది. ప్రతీ వ్యక్తికీ 1 లక్ష బీమా కవరేజ్ ఇచ్చింది. దీని వల్ల ఆ గ్రామాల్లో ప్రజలకు ఇది ఎంతో ఉపయోగపడనుంది. ఇలాంటి నిర్ణయాలు అందరికీ ఆనందం కలిగిస్తాయి. ప్రధానమంత్రి బీమా సురక్షా యోజన ద్వారా.. సంవత్సరానికి 20 రూపాయల బీమా చెల్లిస్తే చాలు.. 2 లక్షల రూపాయల బీమా కవరేజ్ లభిస్తుంది. ఇప్పటికే 58 కోట్ల మందికి పైగా ఈ స్కీమ్‌లో చేరారు. వారిలో 28 కోట్లమంది మహిళలు ఉన్నారు. దీని ద్వారా బాధితులకు ఇప్పటికే 3,700 కోట్ల రూపాయల పరిహారం అందింది. ఇలాంటిదే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకం ఉంది. ఇది కూడా వ్యక్తి చనిపోతే, వారి కుటుంబాలకు 2లక్షల పరిహారం ఇస్తుంది. దీనికి సంవత్సర ప్రీమియం 436 రూపాయలు మాత్రమే. దీన్ని ఇప్పటికే 27 కోట్ల మంది దాకా చేరారు. అలాగే ఇప్పటివరకూ 11 లక్షల కుటుంబాలు బీమా పరిహార సహాయం పొందాయి. వారికి 22 వేల కోట్ల రూపాయలు అందాయి” అని మోదీ తెలిపారు.
మూఢనమ్మకాలు:
“ఇండియాలో వేల ఏళ్లుగా మూఢనమ్మకాలు ఉన్నాయి. వీటి వల్ల ప్రజల్లో భయం పెరుగుతోంది. ఇవి ప్రజల జీవితాల్ని తీవ్ర దుఃఖంలో ముంచేస్తున్నాయి. విజ్ఞానం, నాలెడ్జ్ ద్వారా వీటి నుంచి బయట పడేయాలి. అసోంలో ఒక పక్షి ఉంది. దాని పేరు హర్గీలా. అది ప్రకృతికి చాలా ముఖ్యమైనది. కానీ అసోంలో చాలాకాలం ఆ పక్షిని శకున పక్షిగా చూశారు. వాటిని చూస్తే చాలు.. నష్టం జరిగినట్లే భావించేవారు. కానీ ఆ పక్షులే పర్యావరణాన్ని కాపాడుతున్నాయి. అక్కడి పూర్ణిమా దేవి బర్మన్.. ఈ పక్షుల్ని కాపాడాలని నిర్ణయించారు. ఆమె ప్రజల్లో తప్పుడు అభిప్రాయాన్ని తొలగించారు. మహిళలతో కలిసి.. వారిలో నాలెడ్జ్ పెంచారు. పెద్ద ఉద్యమం చేశారు. ఇప్పుడు వేల గ్రామాల్లో ఆ పక్షిని కాపాడుతున్నారు. మహిళలు హర్గీలా ఆర్మీగా మారి.. ఆ పక్షుల సంఖ్యను పెంచారు. ప్రజల్లో మూఢ నమ్మకాల్ని తొలగించారు” అని మోదీ వివరించారు.
నలందా వర్శిటీ:
“రెండేళ్ల కిందట నేను నలందా విశ్వ విద్యాలయానికి వెళ్లాను. క్యాంపస్ ని ప్రారంభించాను. ఇప్పుడు అది సరికొత్తగా రూపుదిద్దుకుంది. అక్కడ శాస్త్రార్థాలను నిర్వహిస్తున్నారు. ప్రాచీన సంప్రదాయాల్ని కాపాడుతున్నారు. శాస్త్రాలను పఠిస్తున్నారు, నేర్చుకుంటున్నాను. తర్కం, తత్వంతో వాటిని వివరిస్తున్నారు. నలంద వర్శిటీలో ఇలాంటి ప్రయత్నం జరగడం ఆనందకరం. వివిధ దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు శాస్త్రాలను అధ్యయనం చేస్తున్నారు. దేశంలోని ఇతర వర్శిటీల విద్యార్థులు కూడా వచ్చి నేర్చుకుంటున్నారు. ఇలాగే ఢిల్లీలో సెంట్రల్ సంస్కృతి యూనివర్శిటీలో కూడా ఏఐని సంప్రదాయ విజ్ఞానంలో ఉపయోగిస్తున్నారు. భారతీయ భాషల కోసం కొత్త ఏఐ టూల్స్ తయారుచేస్తున్నారు. ప్రాచీన భాషల్ని డిజిటల్ రూపంలోకి మార్చుతున్నారు. మన గీతాలు, సంగీతం, ఆధ్యాత్మికతను డొమినికన్ రిపబ్లికన్‌లో కొందరు బ్రహ్మకమల్ డొమినికానా టీమ్ గా ఏర్పడి.. వేద మంత్రాలను నేర్చుకుంటున్నారు. వాటిని పర్ఫెక్టుగా ఉచ్ఛరిస్తున్నారు. మన పరంపరను వారు నేర్చుకుంటూ ఉండటం ప్రేరణాత్మకం. వారికి శుభకాంక్షలు” అని మోదీ తెలిపారు.
మేఘాలయ:
మేఘాలయలో వేర్లతో బ్రిడ్జి ఉంది. దాన్ని వేర్లతో తయారుచేశారు. సంవత్సరాలపాటూ నిర్మించారు. వేర్లే వంతెనగా మారాయి. అది సజీవ వంతెన. కాలం గడిచేకొద్దీ అది మరింత గొప్పగా మారింది. అది ప్రకృతి గొప్పదనం. మనిషి ప్రకృతితో కలిసి అద్భుతాలు చెయ్యవచ్చు అనేందుకు ఇది నిదర్శనం. ఈ వంతెనలను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలని భారత్ దరఖాస్తు పెట్టింది. ఇప్పుడు అక్కడి ప్రజలు ఈ వంతెనల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు 120కి పైగా వేర్ల వంతెనలను కాపాడుతున్నారు. కొన్నిచోట్ల నర్సరీలను కూడా ఏర్పాటు చేసి.. వీటిని డెవలప్ చేస్తున్నారు. అక్కడి హల్లీ వార్.. పద్మ అవార్డును గెలుచుకున్నారు. ఆయన.. 50 ఏళ్లుగా వేర్ల వంతెనలను కాపాడుతున్నారు. అందరికీ ఆయన ప్రేరణ కలిగిస్తున్నారు. ఎవరైనా ఆ వంతెనలను చూసేందుకు వెళ్తే.. సోషల్ మీడియాలో ఫొటోలను పోస్ట్ చెయ్యండి” అని మోదీ కోరారు.
మట్టి గణపతి విగ్రహాలు:
“ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా.. మట్టి గణపతి విగ్రహాల్ని మాత్రమే కొనాలి. వోకల్ ఫర్ లోకల్ సంకల్పంతో కొనాలి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు కొనవద్దు. పర్యావరణాన్ని కాపాడదాం” అని ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారు.
క్యాచ్ ది రెయిన్:
“వర్షపు నీటిని ఒక్కో చుక్కనూ కాపాడాలి. క్యాచ్ ది రెయిన్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. వర్షపు నీటిని పొదుపు చెయ్యాలి” అని మోదీ పిలుపు ఇచ్చారు.












