Mann Ki Baat 137th Episode: వికసిత్ భారత్ సాకారం కావాలంటే డ్రగ్స్ రహిత దేశంగా మారాలి: ప్రధాని మోదీ | | ACTPnews

News18


Last Updated:

Mann Ki Baat 137th Episode:ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ప్రతీ నెలా ఆల్ ఇండియా రేడియో ద్వారా.. తన మనసులో మాటను ప్రజలతో పంచుకుంటున్నారు. ఆగస్టు 30న మన్‌కీ బాత్ కార్యక్రమం ద్వారా తన మనసులోని మాటను దేశ ప్రజలతో పంచుకున్నాడు. మరి మోదీ ఎమన్నారో తెలుసుకుందాం.

ప్రధాని మోదీ
ప్రధాని మోదీ

భారతదేశం ‘వికసిత్ భారత్’గా అవతరించాలంటే దేశం తప్పనిసరిగా ‘మాదకద్రవ్య రహితం’గా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఆదివారం తన నెలవారీ రేడియో ప్రసంగ కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 137వ ఎపిసోడ్ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని, దేశ భవిష్యత్తును కాపాడటమే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. డ్రగ్స్ రహిత యువత, మత్తు లేని భారతదేశాన్ని నిర్మించడమే ప్రభుత్వ స్పష్టమైన లక్ష్యమని ప్రధాని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘వికసిత్ భారత్ కోసం నషా-ముక్త్ యువ’ (మత్తు రహిత యువత) ప్రచారాన్ని ఆయన కొనియాడారు. పెద్ద సంఖ్యలో ప్రజలు, ముఖ్యంగా యువత ఈ ప్రచారంలో ఉత్సాహంగా, చురుగ్గా భాగస్వాములవుతున్నారని హర్షం వ్యక్తం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed