Maremma Movie: థియేటర్‌లో అట్టర్ ఫ్లాప్.. ఇప్పుడేకంగా రెండు ఓటీటీల్లోకి ‘మారెమ్మ’..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

మాస్ మహారాజా రవితేజ కుటుంబం నుంచి హీరోగా పరిచయమైన మాధవ్ భూపతిరాజు నటించిన తొలి చిత్రం ‘మారెమ్మ’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. పల్లెటూరి నేపథ్యంలో రఫ్ అండ్ టఫ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

News18
News18

మాస్ మహారాజా రవితేజ కుటుంబం నుంచి హీరోగా పరిచయమైన మాధవ్ భూపతిరాజు నటించిన తొలి చిత్రం ‘మారెమ్మ’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. పల్లెటూరి నేపథ్యంలో రఫ్ అండ్ టఫ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు డిజిటల్ వేదికపై మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

‘మారెమ్మ’ సినిమా అక్టోబర్ 9 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. అదే రోజున అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది. దీంతో ఒకే రోజున రెండు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ‘మారెమ్మ’ స్ట్రీమింగ్‌కు రానుండటం విశేషంగా మారింది. థియేటర్లలో ఈ సినిమాను చూడలేకపోయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీ ద్వారా చూసే అవకాశం లభించింది.

మంచాల నాగరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ‘మారెమ్మ’ చిత్రాన్ని మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. ఈ సినిమాతో మాధవ్ భూపతిరాజు హీరోగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. రవితేజ కుటుంబం నుంచి వచ్చిన హీరో కావడంతో మాధవ్ అరంగేట్రంపై సినిమా విడుదలకు ముందే ఆసక్తి నెలకొంది. తొలి సినిమాకే మాస్ టచ్ ఉన్న కథను ఎంచుకున్న మాధవ్.. నటనతో పాటు డ్యాన్స్‌తోనూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

అయితే భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ‘మారెమ్మ’కు అనుకున్న స్థాయిలో స్పందన రాలేదు. ఇప్పుడు ఓటీటీ విడుదలతో సినిమాకు మరోసారి ప్రేక్షకుల ఆదరణ దక్కుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం, యాక్షన్ అంశాలు, దేవతా ఆరాధన చుట్టూ తిరిగే కథాంశం డిజిటల్ ఆడియన్స్‌ను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

తెలంగాణలోని మహిషాపురం అనే గ్రామం నేపథ్యంలో ‘మారెమ్మ’ కథ సాగుతుంది. ఆ గ్రామ ప్రజలు తమ ఇలవేల్పు అయిన మారెమ్మ దేవతను ఎంతో భక్తిశ్రద్ధలతో కొలుస్తుంటారు. గ్రామ సంప్రదాయంలో భాగంగా అమ్మవారికి ఓ పవిత్రమైన దున్నపోతును బలి ఇవ్వడం ఆనవాయితీగా కొనసాగుతూ ఉంటుంది. అదే గ్రామానికి చెందిన కర్ణి అనే యువకుడు ‘మారి’ అనే దున్నపోతును ఎంతో ప్రేమగా పెంచుతుంటాడు. అతడికి ఆ దున్నపోతుతో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. అయితే అమ్మవారికి బలి ఇచ్చే సమయం దగ్గరపడుతున్న సమయంలో ‘మారి’ అనూహ్యంగా కనిపించకుండా పోతుంది.

దున్నపోతు అదృశ్యం కావడంతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం మొదలవుతుంది. అసలు ‘మారి’ ఎక్కడికి వెళ్లింది? దాన్ని వెతికే క్రమంలో కర్ణికి ఎదురైన సమస్యలు ఏమిటి? గ్రామ పెద్దలు, ప్రజలు ఈ ఘటనపై ఎలా స్పందించారు? చివరికి ఆ దున్నపోతు గ్రామానికి ఎందుకు కీలకంగా మారింది? అనే ప్రశ్నలకు సమాధానంగా సినిమా కథ కొనసాగుతుంది. ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ‘మారెమ్మ’.. అక్టోబర్ 9 నుంచి ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియోల్లో అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులకు ఈ ఓటీటీ రిలీజ్ మంచి అవకాశంగా మారనుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports