Last Updated:
మెగా తండ్రీకొడుకులు బరిలోకి దిగబోతున్నారు. అది కూడా మెగా డాటర్ నిహారిక సినిమాతో. తాజాగా మెగా అభిమానులకు ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు వరుణ్ తేజ్.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన విభిన్నమైన కథలతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న వరుణ్, మెగా అభిమానులకు ఓ సర్ప్రైజ్ ఇచ్చారు. తన సోదరి నిహారిక కొణిదెల నిర్మాణంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ‘బరి’ (Bari) సినిమాలో తన తండ్రి నాగబాబుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ మెగా మల్టీస్టారర్ ప్రాజెక్ట్ పై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.
వరుణ్ తేజ్ బాల నటుడిగా తన తండ్రి నాగబాబు నటించిన ‘హ్యాండ్సప్’ (Hands Up) చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించారు. ఆ తర్వాత దాదాపు 26 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఇప్పుడు ‘బరి’ చిత్రంలో పూర్తిస్థాయి హీరోగా, నటుడిగా ఆయనతో కలిసి నటించనున్నారు. ‘కొరియన్ కనకరాజు’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఎన్నారై ఫ్యాన్స్‌తో నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో వరుణ్ ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఒకవైపు చెల్లెలు నిహారిక నిర్మాతగా, మరోవైపు తండ్రి నాగబాబు కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ మెగా కుటుంబానికి అత్యంత ప్రత్యేకం కానుంది. ఒకే సినిమాలో ముగ్గురు మెగా ఫ్యామిలీ సభ్యులు భాగం కావడం అభిమానులకు పండగే అని చెప్పాలి.
మెగా డాటర్ నిహారిక కొణిదెల తన సొంత బ్యానర్ ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ (Pink Elephant Pictures) పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెబ్ సిరీస్‌లు, చిన్న తరహా చిత్రాలతో నిర్మాతగా తన అభిరుచిని చాటుకున్న నిహారిక, ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను టేకప్ చేయడం విశేషం. యదు వంశీ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం వాలీబాల్ క్రీడా నేపథ్యంలో సాగే పక్కా విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందనుంది. ఇప్పటికే స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చిన చిత్రాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది. ఈసారి పల్లెటూరి వాతావరణంలో, మట్టివాసనతో సాగే రస్టిక్ యాక్షన్ తో వరుణ్ రాబోతున్నారు.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana
Aug 06, 2026 12:46 PM IST














