Last Updated:
టాలీవుడ్ దర్శకుడు, మెగా కుటుంబ దగ్గరి బంధువు మెహర్ రమేశ్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన చిన్న అక్క మెహర్ జ్యోతి సుంకర కన్నుమూశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆస్పత్రికి వెళ్లి మెహెర్ రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
టాలీవుడ్ దర్శకుడు, మెగా కుటుంబ దగ్గరి బంధువు మెహర్ రమేశ్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన చిన్న అక్క మెహర్ జ్యోతి సుంకర కన్నుమూశారు. గత రెండు వారాలుగా తీవ్రమైన వైరల్ న్యూమోనియా వ్యాధితో పోరాడుతున్న ఆమె, విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషాదకరమైన వార్తను తాజాగా మెహర్ రమేశ్ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడిస్తూ ఎమోషనల్ అయ్యారు.
జీవితంలోని ప్రతి అడుగులో ప్రోత్సహించిన అక్క ఇక లేదనే నిజాన్ని కుటుంబం తట్టుకోలేకపోతోందని మెహర్ రమేష్ ఆవేదన చెందారు. చిన్నతనం నుంచి ఒక తల్లిలా తనను ఆదరించడమే కాదు.. కూతురి పెళ్లిని ఆమె దగ్గరుండి జరిపించిన జ్ఞాపకాలను ఆయన గుర్తుచేసుకున్నారు.
హెల్త్ ఇష్యూతో డైరెక్టర్ మెహెర్ రమేష్ సిస్టర్ మృతి,హాస్పిటల్ కు వెళ్లి ఫ్యామిలీని పరామర్శించిన Pawan Kalyan గారు.. pic.twitter.com/HpnQDsTPOo
— Amalapuram PK FC™ (@amalapurampkfc) July 22, 2026
ఈ విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తుండగా.. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆస్పత్రికి వెళ్లి మెహెర్ రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన సంతాపం తెలిపిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana














