Meher Ramesh: ఘనంగా మెహర్ రమేష్ కూతురి పెళ్లి.. సతీసమేతంగా చిరంజీవి, పవన్ రావడానికి అసలు కారణమిదే | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ కూతురి పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వేడుకలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు.

News18
News18

టాలీవుడ్ ప్రముఖ స్టైలిష్ డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంట పెళ్లి బాజా మోగింది. ఆయన గారాల పట్టి మోహన వివాహ వేడుక హైదరాబాద్‌లోని ఓ లావిష్ కన్వెన్షన్ హాల్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త తోట చంద్రశేఖర్ కుమారుడు అనిరుధ్‌తో మోహన ఏడడుగులు నడిచారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్‌లో ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఘనంగా నిశ్చితార్థం చేసుకోగా.. జూన్ 1వ తేదీన వైవాహిక బంధంతో ఈ జంట కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. టాలీవుడ్, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు పెద్ద ఎత్తున హాజరై సందడి చేశారు.

ఈ రాయల్ వెడ్డింగ్‌కు మెగా ఫ్యామిలీ రాక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవాతో కలిసి ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మెగా స్టార్స్‌తో పాటు విక్టరీ వెంకటేష్, ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా, యాంకర్ సుమ కనకాల తదితరులు విచ్చేసి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, సీనియర్ నటుడు మురళీ మోహన్, సి. అశ్వినీదత్, బన్నీ వాసు, ఏఎం రత్నం తదితరులు కూడా ఈ వేడుకలో తళుక్కుమన్నారు. వారితో పాటు స్టార్ డైరెక్టర్లు వీవీ వినాయక్, శ్రీను వైట్ల, ఎన్. శంకర్, వీర శంకర్, రచయితలు బీవీఎస్ రవి, కోన వెంకట్ తదితరులు కూడా హాజరయ్యారు. మరోవైపు రాజకీయ ప్రముఖులు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు తదితరులు కూడా విచ్చేసి వధూవరులకు ఆశీస్సులు అందజేశారు.

మెహర్ రమేష్‌కు మెగా ఫ్యామిలీతో అత్యంత సన్నిహిత రక్తసంబంధం ఉన్న విషయం తెలిసిందే. చిరంజీవి తల్లి అంజనా దేవికి, మెహర్ రమేష్ తల్లి సొంత అక్కాచెల్లెళ్లు. ఆ చనువుతోనే మెగా కుటుంబంలో జరిగే ప్రతి వేడుకలో మెహర్ ముందుండి అన్నీ చూసుకుంటారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబులతో ఆయనకు చిన్నప్పటి నుంచే విడదీయరాని అనుబంధం ఉంది. ఆ బాండింగ్‌తోనే ఆయన ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘భోళా శంకర్’ సినిమాను తెరకెక్కించారు.

కెరీర్ పరంగా చూసుకుంటే.. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వద్ద దర్శకత్వ శాఖలో శిక్షణ తీసుకున్న మెహర్ రమేష్, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హీరోగా వచ్చిన ‘వీరకన్నడిగ’, ‘అజయ్’ చిత్రాలతో డైరెక్టర్‌గా బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఆ తర్వాత టాలీవుడ్‌లో ఎన్టీఆర్‌తో ‘కంత్రి’, ప్రభాస్‌తో ‘బిల్లా’, వెంకటేష్‌తో ‘షాడో’ లాంటి యాక్షన్ చిత్రాలను రూపొందించారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతోనూ మెహర్‌కు మంచి స్నేహం ఉంది. ఆ స్నేహంతోనే శోభన్ దర్శకత్వంలో మహేష్ నటించిన ‘బాబీ’ సినిమాలో ఆయన స్నేహితుడిగా స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *