Last Updated:
దర్శకుడు ఆలోచనను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించే బ్రహ్మ సినిమాటోగ్రాఫర్. అంతే కాదు.. నిర్మాత పెట్టే బడ్జెట్ వేల్యూని కూడా పదింతలు చేసి చూపించే మాయాజాలీకుడు కూడా.
దర్శకుడు ఆలోచనను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించే బ్రహ్మ సినిమాటోగ్రాఫర్. అంతే కాదు.. నిర్మాత పెట్టే బడ్జెట్ వేల్యూని కూడా పదింతలు చేసి చూపించే మాయాజాలీకుడు కూడా. సినిమాకు తండ్రి నిర్మాత.. తల్లి దర్శకుడైతే.. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు భుజం కాచే పెద్ద కొడుకు సినిమాటోగ్రాఫర్ అని అనటంలో సందేహం లేదు. ఇలాంటి కీలక శాఖలో తనదైన ప్రతిభను చూపిస్తున్నారు కిషోర్ బోయిడాపు. కెమెరా డిపార్ట్‌మెంట్‌లో చిన్న స్థాయి నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఈయన.. తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లోనూ వర్క్ చేసి తనేంటో ప్రూవ్ చేసుకున్నారు. తాజాగా ఈయన ..నాగబాబు ప్రధాన పాత్రలో ప్రదీప్ మద్దాలి తెరకెక్కించిన సిరీస్ ‘‘మేము కాప్’లం’’ సిరీస్‌తో మన ముందుకు వచ్చి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌ను కేవలం 17 రోజుల్లోనే తెరకెక్కించటంలో కీలక పాత్రను పోషించిన కిషోర్ బోయిడాపు తన సినీ ప్రయాణం, ఎదురైన సవాళ్లు, సిరీస్‌కి సంబంధించిన ఎన్నో విశేషాల్ని పంచుకున్నారు.
నేపథ్యం..
నా పూర్తి పేరు దుర్గ కిషోర్ కుమార్. మా ఫ్యామిలీ అంతా ఇండస్ట్రీలోనే ఉండటంతో సహజంగానే నాకు ఇంట్రెస్ట్ ఏర్పడి ఉంది. మా నాన్న గారు మమ్మల్ని ఫోటో తీసి.. ఆ ఫోటోలతోనే కథ చెప్పేవారు. అక్కడే నాకు ఈ ఫీల్డ్‌లోకి రావాలన్న ఇంట్రెస్ట్ వచ్చింది. అలా నాకు కెమెరా మీద చిన్నప్పటి నుంచే ఆసక్తి ఏర్పడింది.
సినీ ప్రయాణం..
2002లో రవి ప్రసాద్ యూనిట్‌లో కెమెరా అసిస్టెంట్‌గా కెరీర్ స్టార్ట్ చేశా. ఓ నాలుగేళ్ల తరువాత ముంబైకి వెళ్లాను. అక్కడ మొదటి ప్రాజెక్ట్‌గా ‘స్లమ్ డాగ్ మిలియనీర్’కి కెమెరా డిపార్ట్మెంట్‌లో పని చేశాను. ఆ తరువాత ఇంగ్లీష్ సినిమాలకి కూడా వర్క్ చేశాను. ‘మిషన్ ఇంపాజిబుల్ 4’ వంటి 15 హాలీవుడ్ చిత్రాలకు కూడా పని చేసిన అనుభవం ఉంది. 2012లో ‘బాయ మీట్స్ గర్ల్’ అనే సినిమాకి డీఓపీగా పని చేశా. అలా చేస్తున్న టైంలో 2015 లో అనిల్ మెహతా జర్నీ స్టార్ట్ అయ్యింది. ఆ జర్నీ ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమా నుంచి ప్రారంభమై, ‘జెర్సీ’ సినిమా వరకు కొనసాగింది. ఈ ప్రయాణంలో మధ్యలో మరో పది సినిమాల్లో కూడా వర్క్ చేసే అవకాశం వచ్చింది. సార్‌తో కలిసి వన్ ఆఫ్ ది మెయిన్ అసిస్టెంట్‌గా పని చేయడం నా కెరీర్‌లో ఎంతో ఆనందాన్ని, మంచి అనుభవాన్ని ఇచ్చింది. ఆయన దగ్గర నేర్చుకున్న ప్రతి విషయం నా సినిమాటోగ్రఫీ జర్నీలో ఎంతో ఉపయోగపడింది. ఈ జర్నీలో నేర్చుకున్న ప్రతి విషయం నాకు చాలా విలువైనది. థ్యాంక్స్ టు అనీల్ మెహతా గారు. కోవిడ్ తర్వాత నాకు మై నేమ్ శృతి,105 మినిట్స్ వంటి సినిమాల్లో అవకాశం వచ్చినప్పుడు, నేను సార్‌తో మాట్లాడాను. అప్పుడాయాన..“వెళ్లి నీ సొంతంగా వర్క్ స్టార్ట్ చేయి” అంటూ ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అలా మళ్లీ నేను కెమెరామెన్‌గా నా ప్రయాణాన్ని కొత్తగా ప్రారంభించాను.
17 రోజుల్లోనే షూట్..
‘‘మేము కాప్’లం’’ మొత్తం షూటింగ్‌ను కేవలం 17 రోజుల్లో పూర్తి చేశాం. మంచి ప్రీ-ప్రొడక్షన్ ప్లానింగ్ వల్ల, అలాగే ప్రతి డిపార్ట్‌మెంట్ ఎంతో కష్టపడి పనిచేసినందువల్లే అది సాధ్యమైంది. ప్లానింగ్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు అందరూ తమ బెస్ట్ ఇచ్చి సజావుగా పూర్తయ్యేలా సపోర్ట్ చేశారు. ఈ ప్రయాణంలో ఎప్పుడూ క్లారిటీతో, సపోర్ట్‌తో ముందుండిన డైరెక్టర్ ప్రదీప్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా మీద నమ్మకం ఉంచి ఈ ప్రాజెక్ట్‌కు అండగా నిలిచిన ప్రొడ్యూసర్ బీవీఎస్ రవి గారికి, అలాగే మొత్తం ప్రొడక్షన్ టీంకి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నాగబాబు గారు, శ్రీను గారు, రవి గారు మరియు మొత్తం నటీనటులు, టెక్నీషియన్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అందరి సహకారం, టీమ్‌వర్క్ వల్ల షూట్‌ను సమయానికి విజయవంతంగా పూర్తి చేయగలిగాం. రెక్కీ చేస్తున్న టైంలోనే ఏ సీన్‌ని ఎలా తీయాలి.. ఎంతలో తీయాలి.. అనే దాన్ని నేను, ప్రదీప్ కలిసి డిస్కస్ చేసుకున్నాం. మేం ఆఫీస్‌లోనే ఎక్కువగా చర్చించుకున్నాం. ప్రీ ప్రొడక్షన్‌లోనే మేం ఓ క్లారిటీతో ఉన్నాం. అలా కో ఆర్డినేషన్‌తోనే సిరీస్‌ని అనుకున్న ముందుగానే ఫినిష్ చేశాం.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













