MI vs LSG: రెచ్చిపోయిన హిట్‌మ్యాన్.. లక్నోపై ముంబై ఇండియన్స్ సంచలన విజయం | క్రీడా వార్తలు | ACTPnews

PC : X.com


Last Updated:

గాయం నుంచి కోలుకొని ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్ శర్మ (44 బంతుల్లో 84; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) రెచ్చిపోయాడు. రయాన్ రికెల్టన్ (32 బంతుల్లో 83; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. వీరి ధాటికి ముంబై విజయం సులభం అయ్యింది.

PC : X.com
PC : X.com

MI vs LSG: ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ (MI vs LSG) ఖాతాలో మరో విజయం చేరింది. వరుస పరాజయాలకు ఫుల్ స్టాప్ పెడుతూ రికార్డ్ ఛేజ్‌తో ముంబై సంచలన ప్రదర్శన చేసింది. వాంఖడే వేదికగా సోమవారం జరిగిన పోరులో లక్నో సూపర్ జెయింట్స్‌పై 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. 229 పరుగుల భారీ లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో మరో 8 బంతులు మిగిలి ఉండగానే కేవలం 4 వికెట్లు నష్టపోయి ముంబై ఇండియన్స్ ఛేదించింది. గాయం నుంచి కోలుకొని ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్ శర్మ (44 బంతుల్లో 84; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) రెచ్చిపోయాడు. రయాన్ రికెల్టన్ (32 బంతుల్లో 83; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. వీరి ధాటికి ముంబై విజయం సులభం అయ్యింది. మధ్యలో వికెట్లు పడ్డా చివర్లో నమన్ ధీర్ (23 నాటౌట్), విల్ జాక్స్ (10 నాటౌట్) లాంఛనం పూర్తి చేశారు.

229 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ఓపెనర్లు శుభారంభం చేశారు. గాయం నుంచి కోలుకొని చాలా రోజుల తర్వాత రోహిత్ శర్మ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇన్ ఫామ్ బ్యాటర్ రయాన్ రికెల్టన్‌తో కలిసి రెచ్చిపోయాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 10.5 ఓవర్లలో 143 పరుగులు జోడించారు. అనంతరం రికెల్టన్ అవుటయ్యాడు. కాసేపటి తర్వాత రోహిత్ శర్మ కూడా పెవిలియన్ చేరాడు. దాంతో 177 పరుగుల వద్ద ముంబై 2వ వికెట్‌ను కోల్పోయింది. తిలక్ వర్మ (11), సూర్యకుమార్ యాదవ్ (12)లు నిరాశ పరిచారు. దాంతో ముంబై వెంట వెంటనే 2 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో ముంబై శిబిరంలో కాస్త కంగారు మొదలైంది. అయితే నమన్ దీర్, విల్ జాక్స్ మిగిలిన పనిని పూర్తి చేశారు. ముంబైకి ఈ సీజన్‌లో ఇది మూడో విజయం. ప్రస్తుతం 10 మ్యాచ్‌ల్లో 6 పాయింట్లతో 9వ స్థానంలో కొనసాగుతుంది. ఇక లక్నో అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ప్రస్తుతం 4 పాయింట్లతో లీగ్ టేబుల్లో 10వ స్థానంలో కొనసాగుతుంది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (21 బంతుల్లో 63; 1 ఫోర్, 8 సిక్సర్లు) పెను విధ్వంసం సృష్టించాడు. మొన్నటి వరకు బ్యాటింగ్ రాని వాడిలా ఆడిన పూరన్ మునుపటి లయను అందుకున్నాడు. మిచెల్ మార్ష్ (44) రాణించాడు. ఒక దశలో లక్నో12 ఓవర్లలోనే 160 పరుగులు చేసింది. కనీసం 250 పరుగులు చేస్తారని అంతా అనుకున్నారు. అయితే చివరి వరుస బ్యాటర్లు పేలవ ప్రదర్శన చేశారు. చివరి 8 ఓవర్లలో లక్నో కేవలం 68 పరుగులు మాత్రమే చేసింది. మార్క్‌రమ్ (31), హిమ్మత్ సింగ్ (41) టెస్టు బ్యాటింగ్ ఆడారు. ఫలితంగా లక్నో చేయాల్సిన స్కోరు కంటే కూడా ఒక 30 పరుగులు తక్కువే చేసింది.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports