Last Updated:
టాలీవుడ్ సీనియర్ హీరోహీరోయిన్లు శ్రీకాంత్, లయ, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటించిన మిస్టర్ మిడిల్ క్లాస్ థియేటర్స్‌లో నవ్వుల రైడ్ కొనసాగిస్తోంది.
టాలీవుడ్ సీనియర్ హీరోహీరోయిన్లు శ్రీకాంత్, లయ, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. విడుదలైన రోజే ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో థియేటర్స్‌లో నవ్వుల రైడ్ కంటిఎంయు అవుతోంది. ఈ సినిమాలో హీరోకు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆ సన్నివేశాలకు థియేటర్లలో విశేష స్పందన లభిస్తుండగా, కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి.
మధ్యతరగతి కుటుంబాల జీవితం, వారి భావోద్వేగాలు, అనుబంధాలను హృద్యంగా ఆవిష్కరించిన ఈ చిత్రంలో దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి టేస్ట్ స్పష్టంగా కనిపించింది. శ్రీకాంత్, లయ, రాజేంద్ర ప్రసాద్ తమ సహజమైన నటనతో సినిమాకు సినిమాకు ప్రధాన బలంగా కాగా.. సాయి కార్తీక్ సంగీతం మరో అసెట్ అయింది. సునీల్, వెన్నెల కిషోర్, రఘుబాబు, అలీ తదితరులు తమ అద్భుతమైన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.
ఈ చిత్రాన్ని నిర్మాతలు చందు నూతి, జీకే అత్యున్నత నిర్మాణ విలువలతో నిర్మించారు. ప్రతి ఫ్రేమ్‌లో నాణ్యత కనిపించేలా సినిమాను గ్రాండ్‌గా తెరకెక్కించి, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. ముఖ్యంగా నిర్మాత చందు నూతి తొలి చిత్రంతోనే తన అభిరుచి, విజన్‌ను చాటుకోగా, నిర్మాత జీకే తన అనుభవంతో నిర్మాణానికి బలంగా నిలిచారు. ఇద్దరి సమన్వయంతో రూపొందిన ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ నేడు ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ముందుకు సాగుతోంది. ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ ప్రస్తుతం కుటుంబ సమేతంగా చూసి ఆనందించదగ్గ పూర్తి వినోదాత్మక చిత్రంగా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana














