Mouni Roy Divorce: ఇట్స్ అఫీషియల్.. విడాకుల నోట్ వదిలిన మౌనిరాయ్, ఎమోషనల్ పోస్ట్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

మౌని రాయ్, సూరజ్ తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయాన్ని వెల్లడించారు. తాము విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఒక సంయుక్త ప్రకటనలో వారు స్పష్టం చేశారు.

News18
News18

మౌని రాయ్, సూరజ్ తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయాన్ని వెల్లడించారు. తాము విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఒక సంయుక్త ప్రకటనలో వారు స్పష్టం చేశారు. మౌని రాయ్ సూరజ్ నంబియార్ ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో కావడంతో విడాకుల రూమర్స్ మొదలయ్యాయి. సోషల్ మీడియాలో దీనిపై తెగ చర్చలు నడవగా, తాజాగా మౌనిరాయ్ తమ విడాకుల విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించింది. దాదాపు నాలుగేళ్ల పాటు వైవాహిక బంధంలో ఉన్న ఈ జంట, పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వారు ఒక ఉమ్మడి ప్రకటనను విడుదల చేశారు.

తమ వ్యక్తిగత జీవితంపై మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలు, అతిగా జోక్యం చేసుకోవడం పట్ల మౌని, సూరజ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమ బంధం గురించి ప్రచారంలో ఉన్న కల్పిత కథనాలు వాస్తవాలను ప్రతిబింబించడం లేదని వారు స్పష్టం చేశారు. మారుతున్న తమ వ్యక్తిగత ప్రాధాన్యతల దృష్ట్యా, పరస్పర గౌరవంతో విడివిడి దారుల్లో ప్రయాణించాలని నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు. అయితే, భవిష్యత్తులో కూడా తమ మధ్య ఉన్న స్నేహాన్ని గౌరవిస్తామని, దాన్ని అలాగే కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో తమ ప్రైవసీని గౌరవించాలని వారు మీడియాను, అభిమానులను కోరారు.

గోవాలో పెళ్లి.. నాలుగేళ్లకే ముగింపు

మౌని రాయ్, సూరజ్ నంబియార్ కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత, జనవరి 2022లో గోవాలో ఘనంగా వివాహం చేసుకున్నారు. మలయాళీ, బెంగాలీ సంప్రదాయాల్లో జరిగిన వీరి వివాహ వేడుక అప్పట్లో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది. దుబాయ్‌కు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ అయిన సూరజ్‌తో మౌనీ ప్రేమాయణం సాగించి పెళ్లి చేసుకోవడం.. మళ్ళీ నాలుగేళ్లలోనే వివాహ బంధానికి ముగింపు పలకడం జనాల్లో హాట్ టాపిక్ అయింది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports