Last Updated:
తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేలా డీప్‌ఫేక్ కంటెంట్ సృష్టిస్తున్న వారిపై మృణాల్ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. అస్సలు సహించేదే లేదు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
సాంకేతికత పెరిగేకొద్దీ దాని వల్ల వచ్చే అనర్థాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI) దుర్వినియోగం సినీ పరిశ్రమకు, తారల వ్యక్తిగత ప్రతిష్టకు పెను ముప్పుగా పరిణమించింది. నటీమణుల ముఖాలను అశ్లీల వీడియోలు, ఫోటోలకు అతికించి అసహ్యకరమైన రీతిలో మార్ఫింగ్ (Deepfakes) చేయడం ఇటీవల కలకలం రేపుతోంది. తాజాగా ఈ వికృత క్రీడపై టాలీవుడ్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేలా డీప్‌ఫేక్ కంటెంట్ సృష్టిస్తున్న వారిపై మృణాల్ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. “నా రూపం, పోలికలను ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో డీప్‌ఫేక్ వీడియోలు, ఫొటోలు తయారు చేయడం, షేర్ చేయడం అత్యంత చట్టవిరుద్ధం. ఇలాంటి చర్యలను నేను ఏమాత్రం సహించను. దీన్ని నా నుంచి వస్తున్న ఆఖరి హెచ్చరికగా లేదా ‘ఫార్మల్ లీగల్ నోటీసు’గా భావించి వెంటనే ఈ పనులు ఆపేయండి. నా గుర్తింపును మళ్లీ దుర్వినియోగం చేస్తే మాత్రం కఠినమైన చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది” అని ఆమె ఘాటుగా స్పందించింది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఏఐ దుర్వినియోగంపై తారలు గళమెత్తడం ఇదే తొలిసారి కాదు. గతంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో నెట్టింట సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ ఘటన దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలకు దారితీసింది. ఆ సమయంలో తాను తీవ్ర భయాందోళనలకు గురైనట్లు రష్మిక సైతం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తమ ‘పర్సనాలిటీ, వాయిస్ రైట్స్’ (వ్యక్తిగత, స్వర హక్కులు) కాపాడుకునేందుకు పలువురు బాలీవుడ్ అగ్ర తారలు న్యాయస్థానాలను ఆశ్రయించారు. అక్షయ్ కుమార్, అనిల్ కపూర్, వరుణ్ ధావన్, శిల్పా శెట్టి, ప్రీతి జింటా, కార్తిక్ ఆర్యన్, సునీల్ శెట్టి వంటి స్టార్లు తమ అనుమతి లేకుండా తమ వాయిస్, ఇమేజ్ వాడకుండా ముందస్తుగా చట్టపరమైన రక్షణ పొందారు.
కెరీర్ పరంగా చూసుకుంటే.. మృణాల్ ఠాకూర్ ఇటీవల నటించిన ‘డెకాయిట్’ (Dacoit) చిత్రం తెలుగులో మంచి విజయాన్ని సాధించింది. అయితే హిందీలో విడుదలైన ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ సినిమాకు మాత్రం మిశ్రమ స్పందన లభించింది. ప్రస్తుతం ఆమె ఒక భారీ పాన్-ఇండియా ప్రాజెక్టులో భాగమైంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో సుమారు రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమాలో మృణాల్ నటిస్తోంది. ఇది ఒక విజువల్ వండర్‌గా మైథలాజికల్ సైన్స్-ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana














