Last Updated:
Viral Video: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టీఎస్ ఆర్టీసీ బస్ వీడియోకి కూడా విశేష ఆదరణ లభిస్తోంది. ఇంతకీ ఆ ఆర్టీసీ బస్ వీడియోలో ఏముందో తెలిస్తే మీరు కూడా కచ్చితంగా స్పందిస్తారు.
Viral Video: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టీఎస్ ఆర్టీసీ బస్ వీడియోకి కూడా విశేష ఆదరణ లభిస్తోంది. ఇంతకీ ఆ ఆర్టీసీ బస్ వీడియోలో ఏముందో తెలిస్తే మీరు కూడా కచ్చితంగా స్పందిస్తారు. తెలంగాణలో మహాలక్ష్మి పథకం ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆడవాళ్లకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అనే స్కీమ్ అందుబాటులోకి వచ్చిన నాటి నుండి అంటే గడిచిన రెండున్నర ఏళ్ల కాలంలో మగవాళ్లు ఆర్టీసీ బస్సుల్లో సీటు దొరికితే ఒట్టు అంటే నమ్మండి. గతంలోఆడవాళ్లను గౌరవిస్తూ బస్సుల్లో డ్రైవర్ సీటు వెనుక స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం..వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం అనే స్లోగన్‌తో ఓ బోర్డు ప్రతీ బస్సులో కనిపించేది. కాని కాలం మారింది. ఇప్పుడు ఆడవాళ్లు కాదు ఫ్రీ బస్ స్కీమ్ పుణ్యమా అంటూ డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకునే మగవాళ్లకు ఆర్టీసీ బస్సుల్లో సీటు దొరకని పరిస్థితి వచ్చింది. అందుకే ఈ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో స్త్రీలకు బదులుగా పురుషులు అనే బోర్డు పెట్టి ఉంది. ఇక ఈ వీడియోలో అలా రాసిన బోర్డు చూసి నెటిజన్లు తెగ కామెంట్స్ షేర్ చేస్తున్నారు.
మన చుట్టూ జరిగే కొన్ని విషయాలు, కంటికి కనిపించే ఫోటోలు ఇంకొన్ని వీడియోలు చూసినప్పుడు నవ్వు రావడమే కాదు ఇది నిజమే కదా అనే అభిప్రాయం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆలాంటి వీడియోలు, ఫోటోల్లో కాస్తో కూస్తూ యదార్ధం ఉంటుంది కాబట్టి ప్రతీ ఒక్కరూ స్పందిస్తూ ఉంటారు. ఇప్పుడు టీఎస్ ఆర్టీసీ బస్సులో కనిపిస్తున్న బోర్డును చూసి కూడా జనం అంతే షాక్ అవుతున్నారు.తెలంగాణలో తిరుగుతున్న ప్రతీ బస్సులో మగవాళ్లకు సీటు దొరకడం కష్టంగా మారింది. అందుకేనేమో గతంలో స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం.. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం అని బోర్డు ఉండేది. కాని ఇప్పుడు కొన్ని బస్సుల్లో స్త్రీలకు బదులుగా పురుషులను గౌరవించడం మన సంప్రదాయం వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం అనే బోర్డుతో ఉన్న వీడియో సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో చక్కర్లు కొడుతోంది.
ప్రీ బస్ స్కీమ్ వల్ల చాలా చోట్ల మగవాళ్లకు ఆర్టీసీ బస్సుల్లో సీట్లు దొరకని పరిస్థితి. దాన్ని కాస్తా హాస్యాస్పదంగా చెప్పాలనుకున్నారో లేక నిజంగానే టికెట్ కొనుక్కొని బస్సుల్లో నిలువు జీతం తీసుకుంటున్న మగ ప్యాసింజర్ల పట్ల జాలి కలిగిందో తెలియదు కాని.. రెండు, మూడు ఆర్టీసీ బస్సులో ఇదే విధంగా బోర్డులు కనిపించడంతో కొందరు వీటీని తమ సెల్ఫోన్లలో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. అయితే వైరల్ అవుతున్న ఈ వీడియో యదార్ధంగా జరిగిందా లేక వ్యూస్ కోసం ఎవరైనా చమత్కరిస్తూ రీల్ వీడియో చేశారా అనే దానిపై న్యూస్18 దగ్గర స్పష్టత ఇవ్వడం లేదు. కాకపోతే మేడ్చల్, బాలానగర్ డిపోలకు చెందిన పలు బస్సుల్లో ఈ బోర్డులు కనిపించినట్లుగా మాత్రం తెలుస్తోంది.
సోషల్ మీడియాలో జనం యాక్టివ్‌గా ఉండటం.. అందులో మగవాళ్లపై జాలిచూపించే ప్రయత్నం చేయడంతో వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ డిఫరెంట్‌గా కామెంట్స్ చేస్తున్నారు. స్త్రీ కాలంలో అంతే అంటూ ఒకరు.. చివరికి ఈ పరిస్థితికి తెచ్చారు మమ్మల్ని అంటూ మరొకరు రియాక్ట్ అవుతూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంకొందరైతే ఇలాంటి చూసినప్పుడు మాకు కూడా మంచి రోజులు వచ్చాయనిపిస్తోందని కామెంట్ పెట్టారు. టోటల్‌గా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరి ఇలాంటి వీడియోలు చూసిన తర్వాతైనా ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు సీటు ఇవ్వాలనే ప్రతిపాదన రవాణా సంస్థ కాని మహిళాలోకం కాని తెస్తుందేమో చూడాలి.
Hyderabad,Telangana














