Murder: కారులో ట్రాకర్ పెట్టి.. వెంబడించి.. కాలిఫోర్నియాలో భారతీయ మహిళ దారుణ హత్య! | | ACTPnews

నిందితుడు రోహిత్, మృతురాలు షాలిని


Last Updated:

Murder: అమెరికాలోని కాలిఫోర్నియాలో భారత సంతతికి షాలిని ఠాకూర్ అనే మహిళను ఓ యువకుడు అత్యంత కిరాతకంగా కాల్చిచంపిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.

నిందితుడు రోహిత్, మృతురాలు షాలిని
నిందితుడు రోహిత్, మృతురాలు షాలిని

గత ఏడాది కాలంగా తనను ప్రేమించి, పెళ్లి చేసుకోవాలంటూ వెంటపడుతున్న రోహిత్ (22) అనే యువకుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పట్టపగలే రెస్టారెంట్ ఎదుట జరిగిన ఈ దారుణం స్థానికులను, ప్రవాస భారతీయులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. శాక్రమెంటో కౌంటీ పోలీసుల కథనం ప్రకారం.. రోహిత్ అక్రమ మార్గంలో అమెరికాలోకి ప్రవేశించాడనే ఆరోపణలతో 2023లో అరిజోనా పోలీసుల చేతిలో నిర్బంధానికి గురయ్యాడు. కొన్ని రోజుల అనంతరం జైలు నుంచి బయటకు వచ్చిన అతనికి కాలిఫోర్నియాలో ఉంటున్న షాలినితో పరిచయం ఏర్పడింది. అతి తక్కువ కాలంలోనే ఆ పరిచయం తీవ్రమైన వేధింపుగా మారింది. షాలినిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని రోహిత్ ఆమెపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports