Last Updated:
రష్మిక మందన్న ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాప్ గేర్‌లో దూసుకుపోతుంది. వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా ప్రాజెక్టులతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో 2,3 సినిమాలున్నాయి.
రష్మిక మందన్న ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాప్ గేర్‌లో దూసుకుపోతుంది. వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా ప్రాజెక్టులతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో 2,3 సినిమాలున్నాయి. అందులో మైసా సినిమా ఒకటి. రవింద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాల అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే రిలీజైనఈ పోస్టర్‌లు, గ్లింప్స్ గట్రా మాములు అంచనాలు క్రియేట్ చేయలేదు.
ఈ సినిమాలో ఆమె ఒక గోండు గిరిజన యువతిగా కనిపిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ కోసం రష్మిక ఇటీవల కేరళ వెళ్ళింది. అక్కడ జరిగిన కీలక షెడ్యూల్ తాజాగా ముగిసింది. ఈ సందర్భంగా కేరళలో తాను గడిపిన మధుర క్షణాలను, ఎదుర్కొన్న సవాళ్లను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాంది. కొచ్చి అడవుల్లో జరిగిన ఈ సినిమా షూటింగ్ విశేషాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కేరళ అంటేనే పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, అందమైన జలపాతాలకు పెట్టింది పేరు. షూటింగ్ టైమ్‌లో రష్మిక ఈ ప్రకృతి అందాలను చూసి మైమరచిపోయారు. దట్టమైన అడవుల్లో, ఎడతెరిపి లేకుండా కురిసే వర్షాల మధ్య షూటింగ్ సాగడం ఆమెకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది. ప్రకృతి మధ్య గడపడం వల్ల కలిగే ప్రశాంతత ఒకవైపు, షూటింగ్ కష్టాలు మరొకవైపు ఉన్నా.. ఆ పచ్చదనం తనలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని ఆమె తెలిపింది. అడవుల్లో ట్రెక్కింగ్ చేస్తూ లొకేషన్లకు చేరుకోవడం.. ప్రకృతిలో మమేకం కావడం జీవితాంతం గుర్తుండిపోతుందని రష్మిక ఎమోషనల్ అయ్యారు.
ఈ సినిమాలో రష్మిక పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతోంది. అందులో భాగంగా ఎన్నో రిస్కీ యాక్షన్ సీన్లలో ఆమె నటించాల్సి వచ్చింది. ఆ ఎత్తైన కొండల పైన, లోతైన లోయల వద్ద చిత్రీకరించిన పోరాట ఘట్టాల కోసం రష్మిక ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. తన భయాన్ని పక్కన పెట్టి, కేవలం వృత్తి పట్ల ఉన్న అంకితభావంతో ఆ సీన్లలో అద్భుతంగా నటించారు.
షూటింగ్ సమయంలో ఆమె శారీరకంగా ఎంతో శ్రమించారు. దెబ్బలు తగలకుండా మోకాళ్లకు, కాళ్లకు టేపింగ్ వేసుకుని మరీ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్నారు. ఒక్కోసారి వర్షంలో తడుస్తూ గంటల తరబడి షూటింగ్ చేయడం వల్ల ఒళ్లు నొప్పులు వచ్చినా.. సినిమా అవుట్‌పుట్ కోసం ఆమె రాజీ పడలేదు. తనతో పాటు పనిచేస్తున్న చిత్ర యూనిట్ సభ్యుల భద్రత గురించి కూడా ఆమె ఎప్పుడూ ఆరా తీసేవారట. ఇక బాల్కనీలో నిలబడి వర్షాన్ని చూస్తున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, ఆ నేచురల్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఎలాంటి మేకప్ లేకుండా ప్రకృతి మధ్య ఆమె కనిపిస్తున్న తీరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













