N Ramchander Rao : రేవంత్కు ఎన్. రాంచందర్ రావు సవాల్! | ACTPnews

N Ramchander Rao : రేవంత్కు ఎన్. రాంచందర్ రావు సవాల్!



ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ సభలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నాయకుడు ఎన్. రాంచందర్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు ఏమిచ్చిందనే అంశంపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి తేదీ, సమయం ఖరారు చేస్తే సచివాలయం గేటు వద్దకైనా వచ్చి చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కేంద్ర మంత్రులను “సరిహద్దులు దాటనివ్వను” అనడం రేవంత్ రెడ్డి అహంకారానికి నిదర్శనమని, ఒకవేళ బీజేపీ కార్యకర్తలు అనుకుంటే కాంగ్రెస్ నేతలు గ్రామాల్లో కూడా తిరగలేరని హెచ్చరించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports