Last Updated:
అక్కినేని నాగార్జున ల్యాండ్ మార్క్ 100వ చిత్రం (#King100) నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. నాగ్ పుట్టిన రోజు కానుక రెడీ చేసినట్లు మేకర్స్ తెలిపారు.
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో, ‘కింగ్’ అక్కినేని నాగార్జున అభిమానులకు చిత్ర యూనిట్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. నాగార్జున కెరీర్ లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ల్యాండ్ మార్క్ 100వ చిత్రం (#King100) నుంచి క్రేజీ అప్డేట్ అఫీషియల్ గా వెల్లడించారు. ఎటువంటి ముందస్తు హడావుడి లేకుండా సైలెంట్‌గా సెట్స్‌పైకి వెళ్లి ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై సర్వత్రా భారీ అంచనాలు నెలకొన్నాయి.














