Last Updated:
అక్కినేని నాగార్జున సినిమాలతో పాటు పలు వ్యాపార రంగాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా ఆయన మరో కొత్త బాధ్యతను స్వీకరించారు. రెండు దశాబ్దాలకుపైగా B2B సేవల రంగంలో మానవ వనరుల పరిష్కారాలను అందిస్తున్న కాప్స్టన్ సర్వీసెస్ లిమిటెడ్..
అక్కినేని నాగార్జున సినిమాలతో పాటు పలు వ్యాపార రంగాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా ఆయన మరో కొత్త బాధ్యతను స్వీకరించారు. రెండు దశాబ్దాలకుపైగా B2B సేవల రంగంలో మానవ వనరుల పరిష్కారాలను అందిస్తున్న కాప్స్టన్ సర్వీసెస్ లిమిటెడ్.. తన అనుబంధ సంస్థ కాప్స్టన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ‘కాప్స్టన్ హోమ్ సర్వీసెస్’ పేరుతో కొత్త ఆన్‌లైన్ హోమ్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ లాంచ్ కార్యక్రమంలో ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అదే సందర్భంగా ఆయనను కాప్స్టన్ హోమ్ సర్వీసెస్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్లు సంస్థ ప్రకటించింది.














