Last Updated:
భువనేశ్వర్ నుంచి కోల్‌కతా వెళ్లాల్సిన ఇండిగో విమానం రద్దు కావడంతో విమానాశ్రయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గంటల తరబడి నిరీక్షించిన ప్రయాణికులు ఆగ్రహంతో సిబ్బందిపై విరుచుకుపడ్డారు. ఒక మహిళ కౌంటర్‌పైకి ఎక్కి వస్తువులు విసిరేసిన వీడియో వైరల్‌గా మారింది.
భువనేశ్వర్ విమానాశ్రయంలో గురువారం తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. భువనేశ్వర్ నుంచి కోల్‌కతా వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని సాంకేతిక కారణాలతో అకస్మాత్తుగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. విమానం బయలుదేరాల్సిన సమయం కంటే దాదాపు మూడు గంటల పాటు ప్రయాణికులను నిరీక్షించేలా చేసి, చివరి నిమిషంలో క్యాన్సిల్ చేశారని వారు మండిపడ్డారు. సరైన సమాచారం ఇవ్వకుండా తమను ఇబ్బందులకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానం రద్దు వార్తతో సహనం కోల్పోయిన కొందరు ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లోని కంప్యూటర్లు, స్కానర్లను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు.














