Last Updated:
టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ ఖాతాలతో మోసాలు. భక్తులు అప్రమత్తంగా ఉండాలి. అధికారిక టీటీడీ వెబ్‌సైట్/యాప్ ద్వారానే బుకింగ్ చేయాలి.
తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి బుకింగ్ కోసం ఆన్‌లైన్‌లో ప్రయత్నిస్తున్నారా? అయితే ఒక్క చిన్న పొరపాటు చేసినా మీ డబ్బులు పోయే ప్రమాదం ఉంది. టీటీడీ పేరు, లోగోను ఉపయోగిస్తూ నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా పేజీల ద్వారా భక్తులను మోసం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దర్శనం, సేవలు, వసతి టికెట్లు ఇప్పిస్తామంటూ నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు టీటీడీకి ఫిర్యాదులు అందడంతో భక్తులను అప్రమత్తం చేసింది.














