Last Updated:
బాలీవుడ్ స్టార్ నటుడు నానా పటేకర్ కన్ను మూశారు. కార్డియాక్ అరెస్ట్‌తో 75 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచాడు. గోవాలోని తన ఇంట్లో ఒక్కసారిగా గుండెపోటుకు గురైన ఆయనను తన ఫ్యామిలీ.. వెంటనే దోనా పౌలా ఏరియాలోని ఓ ప్రైవల్ హాస్పిటల్‌కు తరలించారు.
బాలీవుడ్ స్టార్ నటుడు నానా పటేకర్ కన్ను మూశారు. కార్డియాక్ అరెస్ట్‌తో 75 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచాడు. గోవాలోని తన ఇంట్లో ఒక్కసారిగా గుండెపోటుకు గురైన ఆయనను తన ఫ్యామిలీ.. వెంటనే దోనా పౌలా ఏరియాలోని ఓ ప్రైవేల్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స జరుగుతుండగానే ఆయన చనిపోయారు. నానా పటేకర్ ఈ రోజు తెల్లవారుజామున 5:20 నిమిషాలకు చనిపోయినట్లు తెలుస్తుంది. ఆయన మరణ వార్తతో బాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
నానా పటేకర్ భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు. హిందీతో పాటు మరాఠీ సినిమాల్లోనూ తన విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విలన్ పాత్రల నుంచి హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు విభిన్నమైన పాత్రలను తనదైన శైలిలో పోషించారు.
1978లో ‘గమన్’ సినిమాతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన నానా పటేకర్, ఆ తర్వాత ఎన్నో గుర్తుండిపోయే చిత్రాల్లో నటించారు. ‘పరిందా’, ‘క్రాంతివీర్’, ‘అగ్ని సాక్షి’, ‘అపహరణ్’, ‘నటసమ్రాట్’ వంటి సినిమాలు ఆయన కెరీర్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ‘క్రాంతివీర్’ సినిమాకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. అలాగే ‘పరిందా’, ‘అగ్ని సాక్షి’ సినిమాలకు ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డులు అందుకున్నారు.
కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడు, రచయితగా కూడా నానా పటేకర్ తన ప్రతిభను చాటుకున్నారు. ఆయన నటనలో కనిపించే సహజత్వం, డైలాగ్ డెలివరీ, భావోద్వేగాలను పలికించే ప్రత్యేక శైలి ప్రేక్షకుల్లో ఆయనకు ప్రత్యేక అభిమానాన్ని సంపాదించి పెట్టాయి. 75 ఏళ్ల వయసులో నానా పటేకర్ మరణించారనే వార్త సినీ అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపుతుంది.














