గతంలో ఫేక్ అలిగేషన్స్ అన్నారు.. మరి ఇప్పుడెందుకు సైలెంట్? గతంలో కూడా వీరిపై ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు, వాళ్లే స్వయంగా లైవ్‌లోకి వచ్చి అవన్నీ తప్పుడు ఆరోపణలని, ఫేక్ అలిగేషన్స్ అని కొట్టి పారేశారు. కానీ, గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఇంత పెద్ద ఎత్తున ఈ స్కామ్ గురించి ప్రచారం జరుగుతున్నా, ట్వీట్లు వైరల్ అవుతున్నా.. నందూస్ వరల్డ్ టీమ్ నుండి ఎలాంటి స్పందన లేదు. వాళ్లు బయటకు వచ్చి క్లారిటీ ఇవ్వకపోవడంతోనే ఈ అనుమానాలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే వీరు నిజంగానే మోసం చేశారా? లేదా దీని వెనుక మరేదైనా టెక్నికల్ రీజన్ ఉందా? అనేదానిపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.













