నయనతార, విఘ్నేష్ శివన్‌కు చెన్నైలో ఉన్న ఖరీదైన ఇల్లు సకల సదుపాయాలతో నిండి ఉంటుంది. దాదాపు 16,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంట్లో స్విమ్మింగ్ పూల్, హోమ్ థియేటర్, జిమ్ కూడా ఉన్నాయి. అంతేకాదు, నయనతార వద్ద కోట్లాది రూపాయల విలువైన డిజైనర్ ఆభరణాలు ఉన్నాయట. దీంతో పాటు, ఆమె తన వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా విస్తరించారు. 2023లో ఆమె ఓ స్కిన్ కేర్ బ్రాండ్‌ను స్థాపించారు. అంతేకాకుండా, ఆమె పలు కంపెనీలలో కూడా పెట్టుబడులు పెట్టారు. ఆమె ఒక సినిమాకు రూ. 10 కోట్లు తీసుకుంటోందట. ప్రస్తుతం ఆమె ఆస్తుల మొత్తం మార్కెట్ విలువ సుమారు రూ. 180 కోట్లు అని తెలుస్తోంది.














