Last Updated:
Nepal-China Border Floods: నేపాల్, చైనా పరిధిలోని టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో బుధవారం సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు తీవ్ర వినాశనాన్ని సృష్టించాయి.
ఈ ప్రకృతి విపత్తు ధాటికి ఇప్పటివరకు కనీసం 160 మంది మరణించగా, వందలాది మంది గల్లంతయ్యారు. భారీ ప్రవాహాల కారణంగా వంతెనలు కొట్టుకుపోయాయి, ఇళ్లు ధ్వంసమయ్యాయి మరియు పలు కీలక జలవిద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. నేపాల్-టిబెట్ సరిహద్దు సమీపంలో భోటే కోషి నదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరగడంతో ఈ ఆకస్మిక వరద పోటెత్తింది. టిబెట్ ప్రాంతంలో భూకంపం సంభవించిన కొద్దిసేపటికే ఈ వరదలు మొదలయ్యాయని, భూకంపం కారణంగా గ్లేసియల్ సరస్సు బద్దలవడం (గ్లేసియల్ అవుట్బర్స్ట్) వల్లే ఈ ఉత్పాతం సంభవించి ఉండవచ్చని నేపాల్ అధికారులు అనుమానిస్తున్నారు. రసువా, ధాదింగ్ జిల్లాల నుంచి నువాకోట్, చిత్వాన్, నవల్పరాసి ఈస్ట్ తదితర ప్రాంతాలకు వరదలు వ్యాపించాయి. బాధితులను రక్షించేందుకు సహాయక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి.














