Last Updated:
Nepal Floods: నేపాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి.
అనేక గ్రామాలు, నివాస ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోవడంతో వందలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో సహాయక చర్యల్లో నిమగ్నమైన నేపాల్ ఆర్మీ సైనికులు ప్రాణాలకు తెగించి బాధితులను రక్షిస్తున్నారు. వరద తీవ్రతకు ఓ నివాస ప్రాంతంలో ఇళ్లన్నీ నీటమునగడంతో, ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ యువకుడు తన ఇంటి మేడపైకి (టెర్రస్) చేరుకుని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. చుట్టూ వరద నీరు భారీగా ప్రవహిస్తుండటం, కిందికి దిగే అవకాశం లేకపోవడంతో సదరు యువకుడు పైకప్పుపైనే చిక్కుకుపోయాడు.














