Last Updated:
స్టార్ హీరోహీరోయిన్ల వారసులు సినీ ఎంట్రీ ఇస్తుండటం కామన్. ఇప్పటికే ఎందరో స్టార్ హీరోల డాటర్స్ సినిమాల్లోకి రాగా, ఇప్పుడు మరో సూపర్ స్టార్ మోహన్ లాల్ కూతురు విస్మయ మోహన్‌లాల్ సినిమాల్లో అడుగుపెట్టబోతోంది.
స్టార్ హీరోహీరోయిన్ల వారసులు సినీ ఎంట్రీ ఇస్తుండటం కామన్. ఇప్పటికే ఎందరో స్టార్ హీరోల డాటర్స్ సినిమాల్లోకి రాగా, ఇప్పుడు మరో సూపర్ స్టార్ మోహన్ లాల్ కూతురు విస్మయ మోహన్‌లాల్ సినిమాల్లో అడుగుపెట్టబోతోంది. ఆమె ప్రధాన పాత్రలో అరంగేట్రం చేస్తున్న భావోద్వేగభరితమైన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘తుడక్కం’. విస్మయ మోహన్‌లాల్ తో పాటు ఆశిష్ జో ఆంటోనీ లీడ్ రోల్స్ ప్లే చేసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమాపై అంచనాలను పెంచుతూ, చిత్ర బృందం సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేసిన అఫీషియల్ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తండ్రీకూతుళ్ల మధ్య ఉండే సంక్లిష్టమైన అనుబంధం, ఎమోషన్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో యాక్షన్ అంశాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ట్రైలర్లో తండ్రి పాత్ర చెప్పే.. ‘‘మంచిగా చదువుకోమని నీకు ఎంతకాలం నుంచి చెబుతున్నాను.. ప్రియను చూడు ఆమె రాసే ప్రతి పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధిస్తుంది’’ అనే మాటలు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబ నేపథ్యాన్ని కళ్లకు కడతాయి.
అయితే, ఆ తర్వాత వచ్చే సీన్స్ కథలోని తీవ్రతను పెంచుతాయి. ‘‘నాన్న ఆరోజు జరిగినదంతా మర్చిపోండి.. అది ఒక పొరపాటు అంతే, మళ్లీ ఇంకెప్పుడూ అలా జరగదు’’ అని కూతురు చెప్పడం, అలాగే ‘‘నీ నోరు అదుపులో పెట్టుకో, లేదంటే కష్టాలు మీ ఇంటి తలుపు తడతాయి’’ వంటి డైలాగ్స్ సినిమాలోని అసలు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను రివీల్ చేస్తున్నాయి. ఇక ఈ ట్రైలర్‌కు క్లైమాక్స్‌లో మోహన్‌లాల్ ఒక పవర్ఫుల్ అండ్ సీరియస్ లుక్‌లో అతిథి పాత్రలో ఎంట్రీ ఇవ్వడం అభిమానులకు గూస్బంప్స్ తెప్పిస్తోంది. తన కుమార్తె తొలి చిత్రానికి మోహన్ లాల్ స్క్రీన్ ప్రెజెన్స్ అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా మారనుందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. గతంలో ‘గ్రెయిన్స్ ఆఫ్ స్టార్‌డస్ట్’ అనే కవితల పుస్తకంతో రచయిత్రిగా తన ప్రతిభను చాటుకున్న విస్మయ మోహన్‌లాల్, ఇప్పుడు హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ దర్శకుడు జూడ్ ఆంటోనీ జోసెఫ్. కేరళ వరదల నేపథ్యంలో ‘2018’ అనే బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించి, భారతదేశం తరఫున ఆస్కార్ ఎంట్రీని దక్కించుకున్న ఈ సెన్సేషనల్ డైరెక్టర్ టేకింగ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రతిష్టాత్మక ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఆంటోని పెరుంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. సాయి కుమార్, బాబీ కురియన్, మనోజ్ కె.జయన్, కేబీ గణేష్ కుమార్, అశ్విన్ తదితర ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana
Aug 05, 2026 10:07 AM IST














