Zaheer Khan: లంక ప్రీమియర్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన టీమిండియా యాక్షన్ హీరో.. ఓనర్‌గా మారిన బౌలింగ్ లెజెండ్! | క్రీడా వార్తలు | ACTPnews

జహీర్ ఖాన్ (ఫైల్ ఫోటో)


Last Updated:

Zaheer Khan: యూనిక్ బౌలింగ్ యాక్షన్.. అతడి రన్నప్‌కు ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. జవగల్ శ్రీనాథ్, వెంకటేశ్ ప్రసాద్‌ల తర్వాత టీమిండియా బౌలింగ్‌ను దశాబ్దం పాటు తన భుజాలపై మోశాడు.

జహీర్ ఖాన్ (ఫైల్ ఫోటో)
జహీర్ ఖాన్ (ఫైల్ ఫోటో)

2011 వన్డే ప్రపంచకప్‌లో భారత్ చాంపియన్‌గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. అతడే జహీర్ ఖాన్. తన బౌలింగ్‌తో బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించిన జహీర్ ఖాన్ ఓనర్‌గా మారాడు. రిటైర్మెంట్ అనంతరం.. కామెంటేటర్‌గా.. కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన పేస్ లెజెండ్ తాజాగా.. ఓనర్‌గా మారిపోయాడు. లంక ప్రీమియర్ లీగ్‌లో ఐకానిక్ జట్టుగా పేరొందిన జాఫ్నా ఫ్రాంచైజీకి జహీర్ ఖాన్ సహ యజమానిగా ఉండనున్నాడు. స్వీడన్ దేశ రాజధాని స్టాక్‌హోమ్‌కు చెందిన ప్రముఖ గ్లోబల్ స్పోర్ట్స్ గ్రూప్ ‘యాంకర్ స్పోర్ట్స్ ఏబీ’ సొంతం చేసుకుంది. ఈ యాంకర్ స్పోర్ట్స్ గ్రూప్‌లో జహీర్ ఖాన్ సహ యాజమానిగా వ్యవహరిస్తున్నారు. యాజమాన్య మార్పిడి అనంతరం, గతంలో ‘జాఫ్నా కింగ్స్’గా పిలవబడే ఈ ఫ్రాంచైజీని అధికారికంగా ‘యాంకర్ జాఫ్నా కింగ్స్’ గా పేరు మారుస్తున్నట్లు ప్రకటించారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో విస్తరణ

గ్లోబల్ క్రికెట్ రంగంలో తమ ఉనికిని మరింత విస్తరించే క్రమంలో యాంకర్ స్పోర్ట్స్ యజమాని నాగేంద్ర సిద్ధౌటమ్, జహీర్ ఖాన్‌తో కలిసి ఈ ఫ్రాంచైజీ బాధ్యతలను స్వీకరించారు. యాంకర్ స్పోర్ట్స్ గ్రూప్ ఇప్పటికే యూరోపియన్ T20 ప్రీమియర్ లీగ్ (బెల్జియం)లోని ‘యాంట్వెర్ప్ యాంకర్స్’, అలాగే కెనడా సూపర్ 60 లీగ్‌లోని ‘వాంకోవర్ యాంకర్స్’ (పురుషుల, మహిళల) జట్లను సొంతం చేసుకుంది. ప్రస్తుతం కొనసాగుతున్న లంక ప్రీమియర్ లీగ్ పాయింట్ల పట్టికలో జాఫ్నా జట్టు టాప్-2 స్థానాల్లో కొనసాగుతోంది.

గ్రాండ్ వెల్‌కమ్ చెప్పిన ఎల్‌పీఎల్ నిర్వహకులు

యాంకర్ స్పోర్ట్స్‌ను లీగ్‌లోకి ఆహ్వానిస్తూ టోర్నమెంట్ హక్కుల నిర్వాహక సంస్థ (IPG) ఛైర్మన్, సీఈఓ అనిల్ మోహన్ మాట్లాడుతూ.. “యాంకర్ స్పోర్ట్స్ గ్రూప్‌ను ఎల్‌పీఎల్ కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. లీగ్ ఆరేళ్ల చరిత్రలో 4 సార్లు ఛాంపియన్‌గా నిలిచి జాఫ్నా జట్టు ఓ ఘనమైన రికార్డును నెలకొల్పింది. కొత్త యాజమాన్యం ఈ జట్టుకు సరికొత్త విజన్‌ను, శక్తుల్ని అందిస్తూ లీగ్ ప్రమాణాలను మరింత పెంచుతుందని ఆశిస్తున్నాం” అని పేర్కొన్నారు.

అలాగే లంక ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ డైరెక్టర్ సమంత దొడన్‌వేల మాట్లాడుతూ.. జహీర్ ఖాన్ లాంటి దిగ్గజ ఆటగాడు లీగ్‌లో భాగస్వామి కావడం ఎల్‌పీఎల్‌కు పెద్ద బూస్ట్ అని, అతని అనుభవం, మెంటార్‌షిప్ శ్రీలంక యువ ఆటగాళ్లకు మైదానంలోనూ, మైదానం వెలుపలా ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

శ్రీలంకతో ప్రత్యేక బంధం: జహీర్ ఖాన్

యాంకర్ జాఫ్నా కింగ్స్ సహ యజమానిగా బాధ్యతలు స్వీకరించడంపై జహీర్ ఖాన్ సంతోషం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. “శ్రీలంక నుంచి వచ్చే బౌలింగ్ ప్రతిభ, నైపుణ్యాలను నేను ఎప్పుడూ ఆరాధిస్తాను. లంక నాకెంతో ఇష్టమైన దేశం. ఎన్నో మ్యాచ్‌లు అక్కడ ఆడాను.. మరెన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఇప్పుడు అదే శ్రీలంక క్రికెట్‌లో ఒక జట్టుకు యజమానిగా భాగం కావడం ఎంతో ఉత్సాహాన్నిస్తోంది. యాంకర్ జాఫ్నా కింగ్స్‌తో నా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని జహీర్ పేర్కొన్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports