దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే.. జనరల్ , ఇతర అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజులో కొంత మినహాయింపు ఇచ్చారు, వీరు రూ. 500 చెల్లిస్తే సరిపోతుంది. ఫీజును క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా ఆన్లైన్లో చెల్లించాలి. ఆన్లైన్ అప్లికేషన్ తో పాటు ఇటీవల దిగిన పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు, టెన్త్ మార్క్స్ మెమో, బీఎస్సీ నర్సింగ్ ప్రొవిజనల్ సర్టిఫికెట్, తాజా కుల ధృవీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్/పీహెచ్ అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను కచ్చితంగా అప్లోడ్ చేయాలి.













