నితిన్ హిట్టు కొట్టి ఆరేళ్లు అయింది. అప్పుడెప్పుడో వచ్చిన ‘భీష్మ’ సినిమా తర్వాత ఇప్పటి వరకు ఇంకో హిట్టు కొట్టలేదు. ప్రస్తుతం ఒక సాలిడ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో నేచురల్ స్టార్ నానితో చేతులు కలిపాడు. నాని ప్రొడ్యూసర్‌గా తన యూనానిమస్ బ్యానర్‌లో చేస్తున్న సినిమాలో నితిన్ హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు అలియాస్ రుక్మిణీ అనే టైటిల్‌ను అనౌన్స్ చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు. శృంగార నవలలు రాసే నితిన్.. తన కలం పేరు రుక్మిణీ అని పెట్టుకుని పాఠకులకు దగ్గరవుతాడు. రుక్మిణి ఎవరంటే తన భార్య అని చెబుతుంటాడు. మరి నిజంగానే రుక్మిణీ తన భార్యనా.. లేదంటే ఇంకేదైనా ట్విస్ట్ ఉందా అనే పాయింట్‌తో మంచి క్యూరియాసిటీ పెంచారు. ఈ సినిమాను దండోరా దర్శకుడు మురళికాంత్ దేవసోత్ తెరకెక్కిస్తున్నాడు.
Source link
Nithiin: శృంగార నవలలు రాసే 'అలియాస్ రుక్మిణీ'.. బాబోయ్ నితిన్ ఈ సారి పిచ్చెక్కించే కాన్సెప్ట్‌తో వస్తున్నాడుగా..! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











