Nivetha Thomos: టాలీవుడ్ లోకి నివేదా థామస్ తమ్ముడు ఎంట్రీ.. ఇదిగో ఫుల్ డీటెయిల్స్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నివేదా థామస్ తమ్ముడు నిఖిల్ థామస్ నటుడిగా పరిచయం కాబోతున్నారు. మరి ఈ కొత్త సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు చూద్దామా..

News18
News18

టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథాంశాలతో కొత్త తరహా చిత్రాలు రూపొందుతున్న తరుణంలో, మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. మంత్ర మూవీ మేకర్స్, ఫాల్కన్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న నూతన చిత్రం ‘బాలక’. మహి – రాజ్ ద్వయం సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ తాజాగా బయటకు వచ్చింది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ (First Look) పోస్టర్‌ను టాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రియదర్షి విడుదల చేశారు.

ఈ సినిమా కథాంశం చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. బతుకు దెరువు కోసమో లేదా ఉద్యోగ అన్వేషణలోనే ఒక ఆంధ్ర కుర్రాడు బెంగళూరు లాంటి ఐటీ మహానగరంలో అడుగుపెట్టిన తర్వాత అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? అతనికి ఎదురైన వింత అనుభవాలు, కష్టాలు ఏంటి? అనే అంశాలను ఆద్యంతం వినోదభరితంగా, హృదయానికి హత్తుకునేలా ఈ చిత్రంలో తెరకెక్కిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ యూత్‌ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

వరంగల్, హనుమకొండ పరిసరాల్లో షూటింగ్..

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. ఈ చిత్రంలోని కీలకమైన సన్నివేశాలను తెలంగాణలోని చారిత్రాత్మక నగరాలైన వరంగల్, హనుమకొండ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్‌ను బెంగళూరు నగరంలో ప్లాన్ చేస్తున్నారు.

నివేదా థామస్ తమ్ముడి ఎంట్రీ.. పటిష్టమైన సాంకేతిక వర్గం

ఈ సినిమా ద్వారా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నివేదా థామస్ తమ్ముడు నిఖిల్ థామస్ నటుడిగా పరిచయమవుతుండటం గమనార్హం. అక్క నటన వారసత్వాన్ని పునికిపుచ్చుకుని నిఖిల్ ఈ చిత్రం ద్వారా వెండితెరకు ఎంట్రీ ఇస్తుండటంతో సినిమాపై ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రానికి మల్లూ నాయక్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. విశ్వదీప్ బాణీలు కడుతుండగా, హర్షిత్ కొటా ఎడిటర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ‘బాలక’ చిత్రం త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports