Perni Nani : ఎన్టీఆర్ పాత వ్యాసంతో చంద్రబాబు పై పేర్ని నాని హాట్ కామెంట్స్ | ACTPnews

Perni Nani : ఎన్టీఆర్ పాత వ్యాసంతో చంద్రబాబు పై పేర్ని నాని హాట్ కామెంట్స్



మాజీ మంత్రి పేర్ని నాని సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ గతంలో చంద్రబాబుపై చేసిన వాగ్బాణాలను బయటపెట్టారు. “చంద్రబాబు నాకన్నా పెద్ద నటుడు” అని ఎన్టీఆర్ ఆనాడే అన్నారని, ఆయన రాసిన ఆర్టికల్ను నాని చదివి వినిపించారు. అందరూ వద్దంటున్నా.. తన కాళ్లపై పడ్డాడని కనికరించి పార్టీలోకి రానిస్తే, చివరికి ఔరంగజేబులా వెన్నుపోటు పొడిచాడని ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేసిన తీరును నాని వివరించారు. చంద్రబాబును ఎన్టీఆర్ “గొడ్డు కన్నా హీనం.. గాడ్సే కన్నా ఘోరం” అని తిట్టారని, పశువుకు గడ్డి వేస్తే విశ్వాసం చూపిస్తుంది కానీ, బాబుకు ఆ విశ్వాసం కూడా లేదని ఎన్టీఆర్ అన్న మాటలను పేర్ని నాని గుర్తు చేస్తూ ప్రస్తుత రాజకీయాలపై విమర్శలు గుప్పించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports