OTTలో స‌రికొత్త ట్రెండ్ సేవ్ ది టైగ‌ర్స్ 3.. మహి వి రాఘవ్ ఖాతాలో మరో సూప‌ర్ హిట్‌ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

జూన్ 19న జియో హాట్‌స్టార్‌లో విడుదలైన ‘సేవ్ ది టైగ‌ర్స్ 3’ సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ఈ సిరీస్‌ భారీ స్థాయిలో వ్యూయర్‌షిప్‌ను సాధించి.. దక్షిణ భారతంలోనే అతిపెద్ద డిజిటల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

News18
News18

జూన్ 19న జియో హాట్‌స్టార్‌లో విడుదలైన ‘సేవ్ ది టైగ‌ర్స్ 3’ సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ స‌క్సెస్ సౌత్ సినిమాలో ఓటీటీ రంగానికి కేవలం మరో హిట్ మాత్రమే ఇవ్వలేదు. రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ఈ సిరీస్‌ భారీ స్థాయిలో వ్యూయర్‌షిప్‌ను సాధించి.. దక్షిణ భారతంలోనే అతిపెద్ద డిజిటల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సాధారణంగా ఒక‌ సిరీస్‌కు వ‌రుస సీజ‌న్స్ వ‌స్తున్న‌ప్పుడు ఒత్తిడితో స‌క్సెస్ త‌గ్గిపోతుంది. కానీ సేవ్ ది టైగ‌ర్స్ సిరీస్ మాత్రం ఇప్పటికే ఉన్న క్రేజ్‌ను సరిగ్గా ఉపయోగించుకుని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌పై అద్భుతమైన ఫ‌లితాన్ని సాధించింది.

వరుస విజయాలతో షోరన్నర్ మహి వి రాఘవ్ తన ప్రతిభను మరోసారి రుజువు చేస్తుకున్నారు. ‘సేవ్ ది టైగర్స్’ మొదటి రెండు సీజన్లు, అలాగే ‘సైతాన్‌’ వంటి థ్రిల్ల‌ర్ ప్రాజెక్టులతో ఇప్పటికే హిట్ ట్రాక్‌లో ఉన్న ఆయన వెబ్ స్పేస్‌లో హిట్ రికార్డ్‌ను కొనసాగిస్తున్నారు. ఓ క‌థ‌ను కమర్షియల్‌గా, ఆక‌ట్టుకునేలా రూపొందించ‌టం అంత ఈజీ కాదు. కానీ ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడంలో మహి సక్సెస్ అయ్యారు. దీంతో ఆయన లాంగ్-ఫార్మ్ స్టోరీటెల్లింగ్‌లో దర్శకుడిగా త‌నేంటో మ‌రోసారి నిరూపించుకున్నారు.

‘ఆనందో బ్రహ్మ’, ‘యాత్ర’లాంటి సినిమాలు చేసిన మహి వి రాఘవ్‌కు ఒక ఫ్రాంచైజీని ఎలా స్ట్రాంగ్‌గా నడిపించాలో బాగా తెలుసు. అదే సమయంలో అసలు ఎంటర్‌టైన్‌మెంట్ వేల్యూని ఏమాత్రం త‌గ్గించ‌కుండా రూపొందించ‌గ‌ల‌రు. ముఖ్యంగా, అమెరికన్, కొరియన్ టీవీ లాంటి బలమైన సంప్రదాయం లేని ఈ ఫార్మాట్‌లో కొత్తదనం తీసుకురావడానికి మహి ప్రయత్నిస్తున్నారు. “ఇండియాలో టెలివిజన్ సిరీస్‌లకు మ‌న ప్రేక్ష‌కులు ఇంకా అల‌వాటు ప‌డలేదు. అందుకే మన దగ్గర ఓటీటీ కల్చర్ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు,” అని ఆయన ఇటీవల ఓ సంద‌ర్భంలో చెప్పారు.

నిర్మాణ సంస్థ త్రీ ఆటమ్ లీవ్స్ కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లడానికి ఎప్పుడూ సిద్ధ‌మే. మళ్లీ మళ్లీ చూసే పాత ఫార్ములాల‌తోనే కంటెంట్‌ను చేయ‌కుండా ప్రత్యేకమైన రీజినల్ కంటెంట్‌ను డెవలప్ చేయడంపైనే ఈ సంస్థ ఎక్కువ ఫోకస్ పెడుతోంది. కొత్త తరహా బిజినెస్ మోడల్స్‌ను తీసుకురావడంలో కూడా ఈ టీమ్ యాక్టివ్‌గా పాల్గొంటోంది. అందుకే వీరి ప్రీమియం కంటెంట్ నేరుగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతూ మంచి రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంటోంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *