Last Updated:
ఈ మధ్యకాలంలో వస్తున్న డిఫరెంట్ కంటెంట్ సినిమాలకు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. మరీ ముఖ్యంగా ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక కంటెంట్ ఉన్న సినిమాల హవా బాగా కనిపిస్తోంది. ఈ లిస్టులోనే ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ.
ఈ మధ్యకాలంలో వస్తున్న డిఫరెంట్ కంటెంట్ సినిమాలకు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. మరీ ముఖ్యంగా ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక కంటెంట్ ఉన్న సినిమాల హవా బాగా కనిపిస్తోంది. ఈ లిస్టులోనే చేరిపోయింది పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘పురుష:’ ఈ సినిమాకి వీరు వులవల దర్శకత్వం వచించగా.. బత్తుల పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ ముఖ్య పాత్రలను పోషించారు.
ఈ సినిమాను మే 22న రిలీజ్ చేయగా థియేటర్స్ లో మంచి స్పందన తెచ్చుకొని ఓటెటీలో కూడా అదే హవా కొనసాగిస్తోంది. ఫ్యామిలీ ఆడియెన్స్, మహిళా ప్రేక్షకుల ఆదరణ లభించడంతో ఈ చిత్రానికి ఘన విజయం దక్కింది. కావాల్సినంత కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో తీసిన ‘పురుష:’ సినిమాతో బత్తుల పవన్ కళ్యాణ్ హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని అందుకున్నారు. కసిరెడ్డి రాజ్ కుమార్, సప్తగిరి, వెన్నెల కిషోర్ పాత్రలు ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ల పాత్రలు సైతం ఆడియెన్స్‌ని ఆకట్టుకున్నాయి. ముగ్గురు హీరోయిన్లకి కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా చూసి 2 గంటల 17 నిమిషాలు నవ్వులే నవ్వులు అన్నారు ఆడియన్స్. అయితే ఈ చిత్రం థియేటర్లో మంచి స్పందన దక్కించుకున్న తర్వాత రీసెంట్‌గానే ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చాయి.
స్ట్రీమింగ్ అయిన కొన్ని రోజులకే ‘పురుష:’ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. అలా అన్ని చోట్లా ఈ మూవీకి మంచి ఆదరణ దక్కుతోంది. ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని చూసేలా ఉండటంతో ఓటీటీలోనూ ఈ సినిమాకి విశేషణమైన ఆదరణ లభిస్తోంది. విడాకుల కోసం కోర్టుకెళ్లిన ముగ్గురు స్నేహితుల కష్టాలు, వారి ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లతో కథ ప్రారంభమవుతుంది. భార్యల్ని యుద్ధంతో కాదు, ప్రేమతో గెలవాలనే మంచి సందేశంతో ఈ సినిమా ముగుస్తుంది. మీరు కూడా వీలు చూసుకొని ఈ సినిమా చూస్తే ఎంచక్కా ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana














