సినిమా అంటే కేవలం ఒక ఎంటర్‌టైన్మెంట్ మాత్రమే కాదు.. మన సమాజంపై అత్యంత ప్రభావం చూపే ఒక మాద్యమం. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, నటులు ప్రతి సినిమాను డబ్బుల కోసం యాక్ట్ చేయరు. తమ నటన, ప్రతిభను నలుగురికి చూపించాలనే పట్టుదలతో సినిమా తీస్తారు. మనం కూడా సినిమా హిట్టైందా లేదా అనే కోణంలో కాకుండా.. అందులోని మంచి విషయాలను, మనల్ని ప్రభావితం చేసే అంశాలపై ఫోకస్ చేయాలి. మనలో చాలా మందికి సినిమాల్లోని కొన్ని క్యారెక్టర్స్ ఎంతోకాలం మదిలో ఉండిపోతుంది. అది పోలీస్ కావచ్చు, లాయర్, ఐఏఎస్, డాక్టర్, ఇంజనీర్.. అంతెందుకు ఒక నక్సలైట్ పాత్ర కూడా మనలో కదలికను తీసుకొస్తుంది.













